ETV Bharat / bharat

బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం! - టీఎంసీ

బంగాల్​లో 49 శాతం ఓట్లతో ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళలు ఉన్నారు. ఇది గమనించిన అధికార తృణమూల్​, ప్రతిపక్ష భాజపా వారి మద్దతే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు మమత. మరోవైపు.. రాష్ట్రంలో జరుగుతోన్న అన్యాయాలనే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటోంది భాజపా. మరి మహిళా ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారు? పార్టీల అంచనాలేంటి?

Women's issues at heart of TMC, BJP
మహిళా ఓట్లపైనే టీఎంసీ, భాజపాల ప్రధాన గురి!
author img

By

Published : Mar 18, 2021, 12:13 PM IST

బంగాల్​లో మహిళా ఓటర్లు 49 శాతం. వారు మద్దతుగా నిలిచే పార్టీకి గెలుపు నల్లేరుపై నడకే. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నిక్లలో.. వారి మద్దతు ఎవరికి? దేశంలోనే ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీకి మళ్లీ జైకొడతారా? లేదా కేంద్ర పథకాలకు ఆకర్షితులపై మోదీ వైపు మొగ్గు చూపుతారా?

'ఆమె' కోసం...

బంగాల్​లో నారీ శక్తిని గుర్తించిన అధికార టీఎంసీ, భాజపా... మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 50 మంది మహిళలకు సీట్లు కేటాయించింది. మహిళ సంక్షేం, భద్రతకు సంబంధించి మేనిఫెస్టోలో కీలక హామీలిచ్చింది. 'బంగాల్​ తన సొంత కుమార్తెను కావాలనుకుంటోంది' అని పదేపదే నినదిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. ఇప్పటికే అమలవుతున్న 'స్వస్త్య సాతీ', 'కన్యశ్రీ' పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ.. భాజపాపై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు.. బంగాల్​లో మహిళలకు రక్షణ కరవైందని, మమతా బెనర్జీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆరోపిస్తోంది భాజపా. కేంద్ర ప్రభుత్వ పథకాలను పదేపదే ప్రస్తావిస్తూ అతివల ఓట్లను రాబట్టుకునేందుకు యత్నిస్తోంది.

'మమత వైపే మహిళా ఓటర్లు'

బంగాల్​ గౌరవాన్ని కాపాడేందుకు బయటివారితో పోరాడుతున్న ఏకైక మహిళా నేత వైపే ఓటర్లు నిలబడతారని ధీమాగా చెబుతున్నారు టీఎంసీ నేతలు.

"1998లో తృణమూల్​ కాంగ్రెస్​ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ, మున్సిపల్​, అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలిపేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 50 మంది మహిళలను బరిలో నిలిపింది. 2016 ఎన్నికలతో పోలిస్తే ఐదుగురు ఎక్కువ. "

- కకోలి ఘోష్​ దస్తిదార్​, టీఎంసీ ఎంపీ

"పలు సామాజిక పథకాలు, విధానాలతో గత 10ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో మహిళా సాధికారత కోసం మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. మహిళల అభివృద్ధి, వివిధ స్థాయుల్లో నిర్ణయాధికారాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించేందుకు టీఎంసీ నిబద్ధతకు మా అభ్యర్థుల జాబితానే నిదర్శనం. గత పంచాయతీ ఎన్నికల్లో మా అభ్యర్థులు 50 శాతం మంది మహిళలే. 2019 లోక్​సభ ఎన్నికల్లో 42 మంది టీఎంసీ అభ్యర్థుల్లో 17 మంది మహిళలే."

- పార్థ ఛటర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి

భాజపా వాదన మరోలా ఉంది.

"బంగాల్​లో మహిళలు సురక్షితంగా లేరని రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలే రుజువు చేస్తున్నాయి. గత 10 ఏళ్లుగా మహిళల భద్రతలో విఫలమైనందున..'నేను బంగాల్​ కుమార్తెను' అనే నినాదం ఎలాంటి ఫలితాన్నివ్వదు."

- అగ్నిమిత్రా పాల్​, భాజపా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు.

2016 ఎన్నికల్లో టీఎంసీ 45 మంది మహిళలను ఎన్నికల్లో నిలిపింది. అదే సమయంలో భాజపా 31 మందికి టికెట్లు ఇచ్చింది.

పూర్వ వైభవం కోసం..

"2009 లోక్​సభ ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు మమతా బెనర్జీతోనే ఉన్నారు. అయితే.. మహిళలపై దాడులతో పట్టణ మహిళల మద్దతులో గండి పడింది. రాష్ట్ర రాజకీయంలోకి భాజపా ప్రవేశించే వరకు గ్రామీణ మహిళలూ మమత వెంటే ఉన్నారు."

-ఓ టీఎంసీ నేత

2009 నుంచి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచిన మహిళా ఓటర్లు.. ఉజ్వల యోజన వంటి పథకాలను భాజపా తీసుకురావటం వల్ల 2019 లోక్​సభ ఎన్నికల్లో కాషాయం వైపు మళ్లాయన్నది టీఎంసీ నేతల విశ్లేషణ. దాంతో వారిని తిరిగి టీఎంసీ వైపు తీసుకొచ్చేందుకు అధికార పార్టీ పలు ఆకర్షక పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల అనంతరం 'బొంగో జనని' అనే ప్రత్యేక ఫ్రంట్​ ఏర్పాటు చేశారు మమత. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'రూపశ్రీ' వంటి పథకాలను మహిళలకు తెలియజేయటమే ఈ ప్రత్యేక ఫ్రంట్​ లక్ష్యం.

మరోవైపు.. బంగాల్​లో మహిళలు సురక్షితంగానే ఉన్నారని చెప్పేందుకు.. భాజపా పాలిత ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​ వంటి రాష్ట్రాల్లో మహిళల పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ.

అది భాజపాకు నష్టమే!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రధానంగా తమ ప్రచారాల్లో మహిళలపై నేరాలను ప్రస్తావిస్తూ టీఎంసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'తల్లి, భూమి, ప్రజలు' అని టీఎంసీ నినదించినంత మాత్రాన ఆ పార్టీ పాలనలో మహిళలపై దాడులు తగ్గవని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఉజ్వల పథకం, ముమ్మారు తలాక్​ వంటి అంశాలే కేంద్రం ప్రచారం సాగిస్తున్నారు.

అయితే... ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చకపోవటం, మమతా బెనర్జీకి సమానంగా శక్తిమంతమైన మహిళా నేత లేకపోవటం తమ పార్టీకి నష్టం చేకూర్చే అంశమేనని భాజపా సీనియర్​ నేత ఒకరు అంగీకరించారు. అత్యాచారాలు, ఉత్తర బంగాల్​, గిరిజన​ ప్రాంతాల నుంచి పెరుగుతున్న మహిళల అక్రమ రవాణాలను ఎత్తి చూపుతూ టీఎంసీ ప్రచారంలో గండికొట్టటంలో తమ పార్టీ బిజీగా ఉందన్నారు.

మరోవైపు.. ఈసారి ఎన్నికల అభ్యర్థుల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన భాజపా.. తొలి రెండు దశల ఎన్నికల్లో ఆరుగురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. మూడో దశ కోసం ప్రకటించిన నలుగురు అభ్యర్థుల జాబితాలోనూ ఒక మహిళ పేరే ఉండడం గమనార్హం. ఇది ఆ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అయితే... సంఖ్య ముఖ్యం కాదని అంటున్నారు భాజపా నేతలు.

"ప్రజాదరణ, ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం బట్టి మా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మహిళా సాధికారత, భద్రత సంబంధిత అంశాలను మా పార్టీ ఎప్పుడూ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విషయంలో మా ప్రత్యర్థుల మాదిరిగా మొసలి కన్నీరు కార్చం. "

- దిలీప్​ ఘోష్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

ఘోష్​ వ్యాఖ్యలను సమర్థించారు అగ్ని మిత్రా పాల్​. మహిళా నేతలకు భాజపా తగిన ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలను నాయకత్వం వహించేలా చేశామన్నారు. టీఎంసీలా కేవలం మహిళా కోటాను పూర్తి చేసేందుకు ఎలాంటి రాజకీయ అనుభవం లేని నటీమణులకు సీట్లు ఇవ్వలేదని విమర్శలు చేశారు.

'రాజకీయాల్లో పురుషాధిపత్యమే'

సంక్షేమ మంత్రం జపిస్తూ నారీ లోకం మద్దతు కోసం రాజకీయ పక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా... ఆయా పార్టీల నిజాయితీపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

"ప్రస్తుత మన పురుషాధిపత్య సమాజం మాదిరిగానే రాజకీయ పార్టీలు సైతం పురుషాధిపత్యంతో నడుస్తున్నాయి. వారు మహిళా సాధికారత కోసం ఎంతో మాట్లాడతారు. కానీ తమ పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంలో వెనకడుగువేస్తారు."

- సునందా ముఖర్జీ, బంగాల్ మహిళా కమిషన్​ మాజీ ఛైర్​పర్సన్

బంగాల్​ మహిళలు ఎవరిని విశ్వసిస్తారో తెలియాలంటే మే 2వరకు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: బంగాల్​లో 'ఆమె' ఓటు మోదీకా? దీదీకా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.