Women Wants Delivery on 22nd January : ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా మంది గర్భిణులు అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారు. ఆ చరిత్రాత్మక రోజును చిరస్మరణీయంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. ఆ రోజున పిల్లలు పుడితే తమ ఇళ్లలో 'రామ్‌లల్లా'కి పునర్జన్మ లభించినంత పుణ్యంగా భావిస్తున్నారు కుటుంబసభ్యులు.
కాన్పుర్‌కు చెందిన ఓ గర్భిణీ జనవరి 22న తనకు ప్రసవం చేయాలని వైద్యులను కోరింది. శ్రీరాముడి తల్లి కౌశల్యను స్మరించుకుని తన ఇంట్లో 'రామ్‌లల్లా' పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది విన్న సీనియర్ వైద్యురాలు సీమా ద్వివేదీ, ఆశ్చర్యానికి గురైరయ్యారు. ఆ రోజు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్న మహిళలందరికీ ఆపరేషన్ చేసేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఈ విషయంపై వైద్యురాలు సీమా ద్వివేదీ 'ఈటీవీ భారత్'తో మాట్లాడారు. 'సాధారణంగా మా ఆస్పత్రిలో ప్రతిరోజూ 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న మరిన్ని ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అయితే దీనికోసం గర్భిణుల ఆరోగ్య పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకోవాలి' అని డాక్టర్ సీమా తెలిపారు. ప్రసవాలు చేసే సమయంలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
'జనవరి 22వ తేదీ చరిత్రాత్మక రోజు కాబోతోంది. అలాంటి రోజున మా ఇంట్లో కూడా రాముడి రూపంలో బిడ్డ పుట్టాలని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. అందుకే శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ రోజున నా కోడలు ప్రసవం అయ్యేలా చూడాలని వైద్యులతో మాట్లాడాము' అని ఆస్పత్రిలో చేరిన గర్భిణీ అత్త చెప్పింది.
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఇదే!
Ayodhya Ram Mandir Opening : అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12గంటల 20 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇక ఇప్పటికే గర్భగుడిలో ప్రతిష్ఠించాల్సిన విగ్రహంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ - 22నే ఎందుకు చేస్తున్నారో తెలుసా?
ఇనుము లేకుండానే రామమందిర నిర్మాణం- 21 అడుగుల గ్రానైట్ పునాది- 'అయోధ్య అద్భుతాలు' ఇవే