ETV Bharat / bharat

వాయుసేన గణతంత్ర విన్యాసాలకు మహిళ సారథ్యం - వాయుసేన

రిపబ్లిక్​ డే సందర్భంగా వాయుసేన ఫ్లైపాస్ట్​ బాధ్యతలను స్వాతి రాఠోడ్​కు అప్పగించారు. ఓ మహిళా అధికారి ఈ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

Republic Day parade
తొలిసారిగా మహిళ ఆధ్వర్యంలో వైమానిక విన్యాసాలు
author img

By

Published : Jan 21, 2021, 2:28 PM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్​పథ్​లో వాయుసేన చేపట్టే వైమానిక విన్యాసాలు ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. గణతంత్ర వేడుకల్లో ఓ మహిళకు ఈ బాధ్యతను అప్పగించడం ఇదే తొలిసారి. ఫ్లైట్​ లెఫ్టినెంట్​​ స్వాతి రాఠోడ్​​​కు ఈ అవకాశం లభించింది.

రాఠోడ్​ ఎవరు?

రాజస్థాన్​లోని ప్రేమ్​పురా గ్రామానికి చెందిన స్వాతి రాఠోడ్​​​ అజ్మేర్​లో పాఠశాల విద్యను, జైపుర్​లోని ఐసీజీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం రాఠోడ్​ అజ్మేర్​లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి డాక్టర్​ భవానీ సింగ్ వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్.

కీలక పాత్ర..

కేరళ వరదల సమయంలో వాయుసేన చేపట్టిన సహాయక చర్యల్లో రాఠోడ్​​ కీలక పాత్ర పోషించారు. వేల మంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎయిర్​ఫోర్స్​ డే సందర్భంగా వైమానిక విన్యాసాలకు బాధ్యత చేపట్టిన అనుభవం ఆమెకు ఉంది. జనవరి 26న ఐదు యుద్ధవిమానాలకు రాఠోడ్​​ బాధ్యత వహిస్తారని సమాచారం.

ఇదీ చదవండి : ప్రాణాలు తీసిన పారాగ్లైడింగ్​- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.