ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్​ దారుణ హత్య.. లైవ్​ వీడియో తీసిన మహిళ.. అసలు ట్విస్ట్​ అక్కడే.. - కర్ణాటక కాలాబుర్గీ వార్తలు

Women killed boyfriend: ఓ మిస్డ్​కాల్​ అతని ప్రాణాల మీదకు తెచ్చింది. కేవలం మూడురోజుల్లోనే ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆ వ్యక్తి.. లవర్​ను కలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ ఆమె దగ్గరకు వెళ్లడమే యువకుడు చేసిన తప్పు. ఆ యువకుడిని దారుణంగా హత్య చేయించింది మహిళ. అయితే ఈ హత్యలో అసలు ట్విస్ట్​ ఎంటో తెలుసా?

బాయ్​ఫ్రెండ్​ దారుణ హత్య
బాయ్​ఫ్రెండ్​ దారుణ హత్య
author img

By

Published : Jul 9, 2022, 7:26 AM IST

Updated : Jul 9, 2022, 2:59 PM IST

Women killed boyfriend: లవర్​ పిలిచిందని ఆనందంగా ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతను ప్రేమించిన మహిళే ఈ దారుణానికి ఒడిగట్టింది. కొందరు దుండగులతో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డ ఆమె.. ఆ హత్యను లైవ్​ వీడియో తీసింది. ఆమె ఇదంతా తన బాయ్​ఫ్రెండ్ చెప్పాడు కాబట్టే చేసింది. ప్రియుడిని చంపేయడమేంటి? అలా చేయమని బాయ్​ఫ్రెండే చెప్పడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్​. ఆమె అసలు లవర్​ మృతిచెందిన వ్యక్తి కాదు.. అతని సోదరుడు! సినీమా స్టోరీలా అనిపిస్తున్న ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలో గతనెల 24న జరిగింది.

ఇదీ జరిగింది..: శుక్రవాడీ గ్రామానికి చెందిన దయానంద లదంతి (24) దుబాయ్​లో పెయింటర్​గా పనిచేస్తున్నాడు. ఇటీవల సొంతూరుకు వచ్చిన దయానంద్​ మళ్లీ దుబాయ్​కు తిరుగు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఓ రోజు అతనికి కలబురగిలోని బసవేశ్వర కాలనీకి చెందిన అంబిక అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చిన మిస్డ్​కాల్​ ఎవరిదో చూద్దామని కాల్​ చేసిన దయానంద్​ అంబిక ట్రాప్​లో పడ్డాడు. అంబిక మాయ మాటలకు.. అతను మూడు రోజుల్లోనే ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ఓ రోజు దయానంద్​కు అంబిక ఫోన్​ చేసి.. కలుసుకుందామని.. తన ఇంటికి రమ్మని పిలిచింది. అంబిక స్కెచ్​ గురించి తెలియని దయానంద్​ ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి పథకం ప్రకారం అంబిక దయానంద్​ను స్కూటీపై ఎక్కించుకుని నగర శివార్లలోని వాజ్​పేయీ కాలనీకి తీసుకెళ్లింది. అదే ప్రాంతానికి షాబజార్​కు చెందిన కృష్ణ, నీలకంఠ్​, సురేశ్​, సంతోష్​ అనే మరో నలుగురు నిందితులు చేరుకున్నారు. అంతా కలిసి దయానంద్​ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అంతటినీ ఆమె వీడియో తీసింది.

ప్రియుడి కోసం..: యాదగిరి జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్న అంబికకు ఇప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈమెకు ఫేస్​బుక్ ద్వారా దయానంద్​కు వరుసకు సోదరుడు అయిన​ అనిల్​ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దయానంద్​ను హత్య చేయాలన్న ఆలోచన కూడా అనిల్​దే. అతని భార్యతో దయానంద్​కు వివాహేతర సంబంధం ఉండటమే అందుకు కారణం. దయానంద్​ను హత్య చేయించాలని నిర్ణయించిన అనిల్​.. తన ప్రియురాలు అంబికతో ఈ విషయం చెప్పాడు. అతని హత్యకుగాను ఆమెకు రూ.3 లక్షల సుపారీ కూడా ఇచ్చాడు. ఆస్తి తగాదాల కారణంగా గ్రామస్థులే దయానంద్​ను హత్య చేశారని అతని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానీ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితురాలు అంబికతో పాటు మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : పేదింటి విద్యార్థికి రూ.2.5కోట్ల స్కాలర్​షిప్​.. అమెరికాలో ఉన్నత విద్య

Last Updated : Jul 9, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.