ETV Bharat / bharat

Woman Paraded With Chappal Garland : మహిళపై అమానవీయం.. మెడలో చెప్పుల దండ వేసి.. రోడ్డుపై ఊరేగించి.. - మహిళ మెడలో చెప్పుల దండ కర్ణాటక

Woman Paraded With Chappal Garland : బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపిస్తూ ఓ మహిళపై కొందరు దారుణంగా ప్రవర్తించారు. ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Woman Paraded With Chappal Garland
Woman Paraded With Chappal Garland
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:36 PM IST

Woman Paraded With Chappal Garland : కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కొందరు వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తించారు. ఓ మహిళ.. బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు దండుకుంటుందని ఆరోపిస్తూ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి మెడలో చెప్పుల దండ వేసి రోడ్డుపై ఊరేగించారు. అయితే ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె భర్త వివరణ వేరేలా ఉంది. అసలేం జరిగిందంటే?

మెడలో చెప్పుల దండ వేసి..
Woman Paraded Video Karnataka : జిల్లాలోని ఘటప్రభ పట్టణం మృత్యుంజయ సర్కిల్​లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు.. ఓ అధికారిని వేధిస్తున్నట్లు స్థానికులు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం రాత్రి ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే తనపై దాడి కూడా చేశారన్న చెబుతున్న బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

'వివస్త్రను చేసి ఊరేగించారు'
"సెప్టెంబరు 30వ తేదీన ఓ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు నా వద్దకు వచ్చి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మొత్తం సొమ్ము ఇవ్వకపోతే ఊరి నుంచి బహిష్కరిస్తామని బెదిరించారు. నేను భిక్షాటన చేస్తూ జీవిస్తున్నానని చెప్పాను. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాను. శుక్రవారం రాత్రి కొందరు మా ఇంటికి వచ్చి మళ్లీ రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగారు. డబ్బు ఇవ్వనందుకు నాపై దాడి చేశారు. తర్వాత నన్ను వివస్త్రను చేసి చెప్పులతో ఊరేగించారు" అని మహిళ ఆరోపించింది.

బాధితురాలు అలా.. ఆమె భర్త ఇలా..
బాధితురాలి వివరణ అలా ఉండగా.. ఆమె భర్త మీడియాతో మాట్లాడారు. "శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మేం భోజనం చేస్తున్నాం. అదే సమయంలో 36 మంది మా ఇంటికి వచ్చి నాపై దాడి చేశారు. దీంతో నా నాలుకపై కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత నా భార్యపై దాడికి పాల్పడ్డారు. బలవంతంగా వివస్త్రను చేసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత నా భార్య మెడలో చెప్పుల దండ వేసి ఇంటి నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఊరేగించారు" అని ఆయన ఆరోపణలు చేశారు.

Woman Paraded : గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. గ్రామమంతా ఊరేగించిన భర్త.. అత్తమామలు కూడా!

నగ్నంగా మహిళల ఊరేగింపు.. ఆ రోజు మణిపుర్​లో అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.