ETV Bharat / bharat

Woman Gets Disability After Treated For Toothache : పంటి చికిత్స కోసం వెళ్లి పక్షవాతానికి గురైన మహిళ.. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే.. - పంటి నొప్పితో చికిత్స పొందిన మహిళకు అంగవైకల్యం

Woman Gets Disability After Treated For Toothache : కర్ణాటకలో వైద్యుడి నిర్లక్ష్యంతో శాశ్వతంగా అంగ వైకల్యానికి గురైంది ఓ మహిళ. పంటి నొప్పితో ఆస్పత్రికి వెళితే.. ఎడమ చేతి, కాలులో చలనాన్ని కోల్పోయింది. ఈ కేసులో వైద్యుడికి రూ.9.2లక్షల ఫైన్​ విధించింది జిల్లా వినియోగదారుల కోర్టు.

woman-gets-disability-after-treated-for-toothache-consumer-court-imposed-a-fine-of-rs-9-dot-2-lakh-to-doctor

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 10:55 PM IST

Updated : Oct 6, 2023, 11:02 PM IST

Woman Gets Disability After Treated For Toothache : పంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్లి.. వైద్యుడి నిర్లక్ష్యంతో శాశ్వతంగా అంగ వైకల్యానికి గురైంది ఓ మహిళ. డాక్టర్​ బాధ్యతారాహిత్యం వల్ల తన ఎడమ చెయ్యి, కాలులో చలనాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితికి కారణమైన వైద్యుడికి రూ.9.2లక్షల ఫైన్​ విధించింది జిల్లా వినియోగదారుల కోర్టు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.

కాగా, బాధితురాలు సుకన్య. చామరాజనగర్ జిల్లాకు చెందిన ఆమె పంటినొప్పితో బాధపడుతూ.. 2021 ఫిబ్రవరి 3న స్థానికంగా ఉన్న గిరిజ డెంటల్​ కేర్​కు చికిత్స కోసం వెళ్లింది. డాక్టర్​ మంజునాథ్​ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి నడుస్తోంది. చికిత్స సమయంలో సుకన్యకు అనస్థీషియా ఇచ్చాడు డాక్టర్ మంజునాథ్​. దీంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తరువాత ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ ఆమెకు ఐసీయూలో వారం పాటు ట్రీట్​మెంట్​ జరిగింది. ఆ సమయంలో లక్షల్లో ఖర్చయింది.

2022 మార్చి 25న ఘటనపై జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు సుకన్య కుమారుడు రవికుమార్​. దీంతో డాక్టర్​ మంజునాథ్​కు సమన్లు జారీ చేసింది కోర్టు. వైద్యానికి సంబంధించిన రికార్డ్​లతో హాజరు కావాలని డాక్టర్​ మంజునాథ్​ను ఆదేశించింది. దీనిపై సంవత్సరం నాలుగు నెలల తరువాత తీర్పు వెలువరించింది కోర్టు. పలువురి నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. డాక్టర్​ మంజునాథ్​ బాధ్యతారాహిత్యం వల్లే ఆ మహిళ తన ఎడమ చేతి, కాలు చలనం కోల్పోయిందని తెలిపింది.

వినియోగదారుల కోర్టు జడ్జి ఎంవీ భారతి.. ఈ కేసుపై విచారణ జరిపి తుది తీర్పును వెల్లడించారు. బాధితురాలికి ఆసుపత్రికి ఖర్చులు రూ.6,14,605 కాగా.. వాటికి అదనంగా మరో రూ.3 లక్షలు చెల్లించాలని కోర్టు తెలిపింది. మరో రూ.10వేల రూపాయలను ఫైన్​ కింద కట్టాలని ఆదేశించింది. మొత్తం రూ.9,24,605 బాధితురాలికి చెల్లించాలి వైద్యుడికి సూచించింది. 30 రోజుల్లో పరిహారాన్ని బాధితురాలికి అందించాలని స్పష్టం చేసింది.

"బాధిత మహిళకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్​ మంజునాథ్​ బాధ్యతరహితంగా వ్యవహరించాడు. ఈ విషయం మా విచారణలో వెల్లడైంది. ఎటువంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించకుండానే.. సుకన్యకు ఇంజెక్షన్​ ఇచ్చినట్లు నిర్థరణ అయింది" అని జిల్లా వినియోగదారుల కోర్టు వెల్లడించింది. అనంతరం వైద్యుడికి ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

డెలివరీ చేసి కడుపులో టవల్‌ వదిలేసిన వైద్యుడు.. ఐదు రోజుల తర్వాత మరో ఆపరేషన్​

ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్​.. కట్​ చేస్తే జైల్లో ఊచలు లెక్కపెడుతూ..

Last Updated : Oct 6, 2023, 11:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.