ETV Bharat / bharat

బ్యూటీ పార్లర్​ వెళ్లేందుకు నో చెప్పిన భర్త.. ఉరి వేసుకుని భార్య ఆత్మహత్య - కుటుంబ గొడవల్లో మహిళ ఆత్మహత్య

బ్యూటీ పార్లర్​ వెళ్లొద్దని చెప్పినందుకు ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని భార్య గొంతు కోసి చంపేశాడు ఓ వ్యక్తి. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి.. వివిధ చోట్ల పడేశాడు. హరియాణా జరిగిందీ ఘటన.

woman-dies-by-suicide
బ్యూటీ పార్లర్​ వెళ్లొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్య..
author img

By

Published : Apr 29, 2023, 7:12 PM IST

మధ్యప్రదేశ్​ ఇందౌర్​లో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్​కు వెళ్లొద్దని చెప్పినందుకు.. ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. భర్త భయటకు వెళ్లిన సమయంలో సీలింగ్​కు ఉరివేసుకొని చనిపోయింది. అనంతరం ఇంటికి వచ్చిన భర్త.. విగతజీవిగా ఉన్న భార్యను చూసి కన్నీరు మున్నీరయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బల్​రాం యాదవ్​, రీనా యాదవ్​ (34) భార్య భర్తలు. వీరిద్దరు ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కీమ్​-51లో నివాసం ఉంటున్నారు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గురువారం రీనా​.. భర్త బల్​రాంను బ్యూటీ పార్లర్​కు వెళ్తానని అడగగా.. అతడు తిరస్కరించాడు. దీంతో మనోవేధనకు గురైన రీనా.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

భార్యను హత్య చేసి.. ముక్కలుగా నరికిన భర్త.. అదే కారణం..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని భార్యను అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఆమె గొంతు కోసి.. శరీరాన్ని ఛిద్రం చేశాడు. తల, చేతులు, కాళ్లు నరికేసి.. వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆమె మొండాన్ని తగలబెట్టాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా.. భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..
ముఖేశ్​, సోనియా భార్యభర్తలు. వీరికి ఓ పాప కూడా ఉంది. వీరంతా కలిసి మనేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ముఖేశ్.. ఓ రిటైర్డ్​ నేవీ ఉద్యోగి. 2018లో బిహార్​ నుంచి వస్తున్న రైలులో ముఖేశ్​కు ఓ మహిళ పరిచయం అయింది. వారిద్దరీ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరికి ఓ చిన్నారి సైతం జన్మించింది. ఆమెను కలిసేందుకు తరచూ ముఖేశ్​ వెళుతుండేవాడు. దీంతో భార్యభర్తలిద్దరి మధ్య పదేపదే గొడవలు జరుగుతుండేవి. దీంతో భార్యను అడ్డు తొలగించుకోవాలని భావించిన ముఖేశ్​.. ఆమెను హత్య చేశాడు.

"ఏప్రిల్​ 21న ముఖేశ్​.. తన భార్య గొంతు కోసి చంపేశాడు. అనంతరం బాత్రూరూంలో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు. మృతురాలి తలను ఓ చెరువులో పడేశాడు. సీసీటీవీ పుటేజ్​ల ఆధారంగా ముఖేశ్​.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు గుర్తించాం." అని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. అనంతరం కోర్టులో హాజరు పరిచామని వారు వెల్లడించారు.

యువతిని హత్య చేసిన ఇద్దరు సోదరులు
తనతో సహజీవనం చేస్తున్న యువతిని హత్య చేశాడు ఓ వ్యక్తి. తన చెల్లి, సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం తన స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని ఓ పాఠశాల పక్కన పడేశాడు. దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన జరిగింది. మృతురాలి శరీరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని రోహినా నాజ్​(25)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఉత్తరాఖండ్‌లోని మిరాజ్‌పూర్ చెందిన యువతిని అని తెలిపారు. ప్రధాన నిందితుడు వినీత్​ పన్​వార్​ వారు వెల్లడించారు. నిందితులు అందరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

కాలేజీ గొడవల్లో విద్యార్థి మృతి..
ఓ ఇంజనీరింగ్​ విద్యార్థిని పొడిచి చంపారు తోటి విద్యార్థులు. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు.. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. రెవా యూనివర్సిటీ కాలేజ్​లో జరిగిన ఫెస్టివల్​లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.