ETV Bharat / bharat

జిమ్​లో వర్కవుట్స్​​​ చేస్తూ అక్కడే కుప్పకూలి.. - వ్యాయామం చేస్తూ మహిళ మృతి

Woman died in gym: ఓ మహిళ ఉన్నట్లుండి.. జిమ్​లో వర్కవుట్​ చేస్తూ కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

woman died in gym
వ్యాయామం చేస్తూనే కుప్పకూలిన మహిళ
author img

By

Published : Mar 26, 2022, 5:53 PM IST

Updated : Mar 26, 2022, 7:06 PM IST

Woman died in gym: జిమ్​లో వర్కవుట్స్​ చేస్తూ కుప్పకూలింది ఓ మహిళ. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ ఘటన. ఆమె పడిపోయిన తర్వాత హుటాహుటిన వచ్చిన చుట్టుపక్కల వారు.. స్పృహలోకి రప్పించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. సీసీటీవీలో నమోదైన సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న వినయకుమారి(44) శుక్రవారం నైట్​ షిఫ్ట్​ చేసి ఇంటికి వచ్చింది. శనివారం ఉదయం మల్లేష్​పాల్యాలోని ఓ జిమ్​కు​ వెళ్లింది. వర్క్​అవుట్స్​ చేస్తూ అలాగే కుప్పకూలింది. ఆమెను సీవీ రామన్ నగర్​​ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని నిర్ధరించారు వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు పంపించారు.

ఇదీ చూడండి: భార్య, అత్తమామలపై కత్తితో దాడి.. కత్తితో రోడ్డుపైనే దారుణంగా!

Last Updated : Mar 26, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.