ETV Bharat / bharat

పెళ్లి పేరుతో మోసం.. తల్లీకూతుళ్లపై గ్యాంగ్​ రేప్.. 2 నెలల చిన్నారిపైనా.. - bihar chhapra news

Woman Daughter Gang Raped: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనపై, తన కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఆ వ్యక్తి.. తన తండ్రి, ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీ కన్నౌజ్​లో జరిగిందీ ఘటన. బిహార్​లో 2 నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు.

UP: Woman and minor daughter gang-raped by four on the pretext of marriage

author img

By

Published : Apr 20, 2022, 6:02 PM IST

Updated : Apr 20, 2022, 8:02 PM IST

Woman Daughter Gang Raped: ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి తన తండ్రి, స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తన మైనర్​ కుమార్తెపైనా అఘాయిత్యం చేశారని తెలిపింది. సదర్​ కొత్వాలీకి చెందిన బాధిత మహిళ.. మావైయా గ్రామానికి చెందిన అమిత్​ అలియాస్​ నహర్​ సింగ్​, అతడి తండ్రి రామ్​ సింగ్​, స్నేహితులు దిలీప్​, పవ్​నేష్​లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రధాన నిందితుడు అమిత్​.. బాధితురాలికి కాబోయే వరుడు అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ మూడేళ్ల క్రితం తన భర్త నుంచి విడాకులు పొందింది. 2020లో ఆమెకు రెండో పెళ్లి చేయాలని భావించారు బాధిత మహిళ బంధువులు. ఈ మేరకు అమిత్​తో మాట్లాడారు. కొన్నిరోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆ మహిళను, తన ఇద్దరు కుమార్తెలను తనతోనే ఉండాలని ఇంటికి పిలిచాడు నిందితుడు. ఈ క్రమంలోనే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. నిందితుడు నోయిడాలోని తన ఇంటికి ఈ జనవరిలో తీసుకెళ్లి తండ్రి, స్నేహితులతో.. మహిళ, ఆమె ఒక కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశారు.

ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు.. వీడియోలు తీసి బ్లాక్​మెయిల్​ చేశారని బాధిత మహిళ ఆరోపించింది. తనను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారని ఆవేదన చెందింది. తన 15 ఏళ్ల కూతుర్ని కూడా కాల్చి చిత్రహింసలు పెట్టారని పోలీసులకు వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

2 నెలల చిన్నారిపై: బిహార్​ ఛప్రాలో మరో దారుణం జరిగింది. రెండు నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. నవ్​దియారీ గ్రామంలోని తన సోదరి ఇంటివద్ద ఉండే యువకుడు.. పొరుగింట్లోని పసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప ఏడుపు విన్న గ్రామస్థులు.. సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సంతోష్​ కుమార్​ను చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

మద్యానికి బానిసై చిన్నారి విక్రయం: మద్యానికి బానిసైన ఓ తండ్రి డబ్బు కోసం సొంత కూతుర్నే అమ్మకానికి పెట్టిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. భండారా నివాసి ఉత్కర్ష్ దలీవలే.. పని కోసం నాగ్‌పుర్‌లోని రాణి దుర్గావతి ప్రాంతంలో భార్యతో స్థిరపడ్డాడు. నెలరోజుల క్రితమే ఈ దంపతులకు ఓ ఆడ బిడ్డ జన్మించింది. మద్యానికి బానిసైన తండ్రి.. డబ్బు కోసం రూ. 70 వేలకు పాపను విక్రయించాడు. భార్య వద్దని ఎంత వారించినా.. అతడి మనసు కరగలేదు. శిశువు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

యువకుడిపై లైంగిక దాడి: ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో కళాశాల విద్యనభ్యసించే ఓ యువకుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ బీఎస్​పీ నేత. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ఆ నేత తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. వీడియో తీసిన నిందితుడు.. సోషల్​ మీడియాలో పెడతానని బ్లాక్​ మెయిల్​ చేసినట్లు పోలీసులకు వివరించారు.

ఇవీ చూడండి: పరువు హత్య.. కుమార్తెను, అల్లుడిని దారుణంగా కత్తితో పొడిచి..

మరో వ్యక్తికి పశువుల ఇంజెక్షన్​.. నకిలీ వైద్యుడి కోసం వేట!

Last Updated : Apr 20, 2022, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.