Winter Fest at Ramoji Film City 2023 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో శీతాకాల సంబరాలకు తెరలేవనుంది. 45 రోజుల పాటు జరిగే వింటర్ ఫెస్ట్(Winter Fest) పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్న వేడుకలు జనవరి 28 వరకు కొనసాగనున్నాయి. ఈ కార్నివాల్‌ను ఎంజాయ్ చేయడానికి ఫిల్మ్‌సిటీ, పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ramoji Film City Winter Carnival 2023 : 45 రోజులు కొనసాగే ఈ ఫెస్ట్‌లో పర్యాటకుల్లో శీతాకాలపు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక వినోదాలు, సరదా కార్యక్రమాలు, లైవ్ షోలు, థ్రిల్లింగ్ రైడ్‌లు, ఆటలతో పాటు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొనే బర్డ్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, బాహుబలి సెట్‌లు, ఇంకా మరెన్నో విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పర్యాటకులు ఈ ఫెస్ట్‌ను ఆస్వాదించవచేలా వీలు ఉంటుంది. కార్నివాల్ పరేడ్, సాయంత్రం విద్యుత్ దీపాల ధగధగల మధ్య వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ట్రావెల్ ట్రేడ్ షోలో.. ఆకట్టుకుంటున్న రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్
భారతీయ సినిమాకి పట్టం : భారతీయ సినిమా 110వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా సినిమా రంగం సాగించిన అద్భుత ప్రయాణ నేపథ్యంగా రూపుదిద్దుకున్న పాటలు, నృత్యాలు మరింత వినోదాన్ని అందిస్తాయి.
మిరుమిట్లు గొలిపేలా అందాలు : ఫిల్మ్‌సిటీలోని తోటలు, మహల్లు, కట్టడాలు, మార్గాలను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించడం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారైనా కనులారా ఆ దృశ్యాన్ని వీక్షించాలి అన్నంతగా మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
కార్నివాల్ పరేడ్ : ఎంతో సరదాగా సాగిపోయే కార్నివాల్ పరేడ్‌లో జగ్లర్లు, స్టిల్ట్ వాకర్స్, వారి వేషాలు, ప్రదర్శనలు, మొబైల్ డీజేతో ఆకట్టుకునే సౌండ్‌ట్రాక్‌లు మనసును కదిలించే వినోదాన్ని పర్యాటకులకు పంచుతాయి.
లైవ్ డీజే ప్రదర్శన : శీతాకాలంలో జరగనున్న ఈ వింటర్ ఫెస్ట్‌లో సాయంకాలం వేడుకలు ఎంతో ఆహ్లాదకరంగా సాగుతాయి. ఒకవైపు లైవ్ డీజే ప్రదర్శనను ఆస్వాదిస్తూనే మరోవైపు విందును ఆరగించవచ్చు. ఇలా ఎప్పటికి మీకు గుర్తుండిపోయోలా చేస్తాయి కార్యక్రమాలు.
నూతన సంవత్సర సంబరాలు : డిసెంబరు 30, 31వ తేదీన పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే పార్టీలు ప్రత్యేకంగా హోటళ్లలో దిగిన అతిథుల కోసం ఏర్పాటు చేయనున్నారు. హోటల్‌లో బస చేయడం ద్వారా వింటర్ ఫెస్ట్‌తో పాటూ కొత్త ఏడాది వేడుకలను రామోజీ ఫిల్మ్‌సిటీలో జోష్‌గా జరుపుకోవచ్చు. అన్ని వర్గాల వారి బడ్జెట్‌కు తగ్గట్టుగా ఆకర్షణీయ ప్యాకేజీలను ఆర్‌ఎఫ్‌సీ(RFC) రూపొందించింది. మరిన్ని వివరాలను www.ramojifilmcity.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
సంప్రదించండి ఇలా..: రామోజీ ఫిల్మ్‌సిటీ లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్‌లో పాలుపంచుకొనేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్1800 120 2999 కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.