ETV Bharat / bharat

మోదీ X దీదీ: దిల్లీ పీఠం కోసం 'ఆపరేషన్​ ముకుల్'!

"ముందు బంగాల్​లో విజయం... తర్వాత దిల్లీలో పరివర్తన్​(మార్పు)"... మార్చి 18న బంగాల్ ఎన్నికల ప్రచార సభలో టీఎంసీ అధినేత్రి చెప్పిన మాటలివి. వీటిని నిజం చేసుకునేందుకు ఆ పార్టీ ఏం చేయబోతోంది? జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ చక్రం తిప్పడం సాధ్యమేనా? ఇందుకు ఆ పార్టీ దగ్గరున్న ప్రధాన అస్త్రమేంటి?

Mukul Roy
ముకుల్ రాయ్
author img

By

Published : Jun 13, 2021, 5:00 PM IST

"జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా దీదీ"... బంగాల్​ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత విస్తృత చర్చ జరిగింది ఈ అంశంపైనే. అందుకు తగ్గట్టే జాతీయ ఆకాంక్షలను, అందుకు అనుసరించే ప్రణాళికలను బయట పెట్టింది తృణమూల్ కాంగ్రెస్​. జాతీయ రాజకీయాల్లో సీనియర్​ నేత ముకుల్ రాయ్​కు ఉన్న​ అనుభవాన్ని ఆసరాగా చేసుకుని... ఈ వ్యూహాలను అమలు చేయాలని భావిస్తోంది టీఎంసీ. భాజపాను వీడి కొద్ది రోజుల క్రితమే తృణమూల్​ కాంగ్రెస్​లోకి తిరిగొచ్చారాయన.

టీఎంసీ జాతీయ ఆకాంక్షలపై చర్చ నేపథ్యంలో... ముకుల్​ రాయ్​, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మధ్య శనివారం జరిగిన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు బయటకు రాకపోయినా.. దిల్లీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై చర్చించినట్లు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఇదీ చదవండి : 'దేశవ్యాప్తంగా టీఎంసీ- భాజపా ఉన్న చోట్ల పోటీ'

ముకుల్​ తర్వాత వచ్చేదెవరు?

ముకుల్​ రాయ్​.. టీఎంసీ గూటికి తిరిగి చేరిన తర్వాత చాలామంది భాజపా నాయకులు, ముఖ్యంగా ముకుల్​కు ఆప్తులు, సన్నిహితంగా ఉన్నవారు తృణమూల్ కాంగ్రెస్​లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వీరిలో ఎవరిని పార్టీలోకి ఆహ్వానించాలి? అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

జాతీయ స్థాయిలో ముకుల్ పాత్ర..

2022లో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో మంచి పట్టున్న ముకుల్​ రాయ్​కు ఎలాంటి పదవి ఇస్తే.. జాతీయ స్థాయిలో తృణమూల్​ కాంగ్రెస్​ బలపడేందుకు అవకాశం ఉంది? అన్న దానిపైనా అభిషేక్​ చర్చించినట్లు తెలుస్తోంది. రాయ్​.. సలహాలు, వ్యూహాలతో వచ్చే ఏడాది జరిగే ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించాలని టీఎంసీ భావిస్తోంది.

క్రిష్​ నగర్​ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందిన రాయ్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో చక్రం తిప్పేందుకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : Bengal: కేంద్ర భద్రత వద్దంటూ ముకుల్​ రాయ్​ లేఖ

త్రిపురలో పాగా కోసమేనా?..

ఈశాన్య రాష్ట్రం అయిన త్రిపురలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం త్రిపురలో భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పాగా వేసేందుకు యత్నిస్తోంది. ఈ మేరకు ముకుల్ రాయ్​తో.. పార్టీ చర్చలు జరుపుతోంది. శనివారం అభిషేక్ బెనర్జీ , ముకుల్ రాయ్​ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది.

ఇలా పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్న టీఎంసీ జాతీయ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాలి.

ఇదీ చదవండి : 'ప్రధానిని గద్దె దించడమే నా లక్ష్యం'

మోదీ మీటింగ్​లో దీదీ తీరుపై కేంద్రం గుస్సా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.