ETV Bharat / bharat

కూర రుచిగా లేదన్నందుకు.. తల పగులగొట్టిన భార్య! - భార్యాభర్తల వార్తలు

ఆహారం రుచిగా లేదని చెప్పినందుకు భర్త తలపై రాడ్డుతో కొట్టింది భార్య (husband wife quarrel). బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

wife attacked husband
భార్య భర్తల గొడవ
author img

By

Published : Sep 7, 2021, 10:34 AM IST

Updated : Sep 7, 2021, 12:11 PM IST

సంసారమన్నాక సవాలక్ష గొడవలుంటాయి. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వాదనలు(husband wife quarrel) రావడం సహజమే. కానీ, ఒక్కోసారి ఇలాంటి చిన్న తగువులే తీవ్రమవుతుంటాయి. అనవసర ఘటనలకు దారితీస్తాయి. హరియాణాలోని హిసార్ జిల్లాలో (hisar in haryana) ఇదే జరిగింది. కూర బాగాలేదని చెప్పిన పాపానికి భర్త తల పగులగొట్టింది (wife attacks husband) భార్య.

ఏం జరిగిందంటే?

దినేశ్, బిందియా అనే దంపతులు బార్వాలా (barwala) పట్టణంలో నివసిస్తున్నారు. ప్రతిరోజులాగే తన భర్త కోసం ఆహారం సిద్ధం చేసింది బిందియా. అయితే, కూరలో ఉప్పు తక్కువైందని భావించిన దినేశ్.. అదే విషయాన్ని భార్యతో చెప్పాడు. ఆహారం అంత రుచిగా లేదని అన్నాడు. ఇకపై కూరల్లో చక్కెర వేయొద్దని తెలిపాడు.

అంతే, ఈ చిన్న విషయానికే భర్త దినేశ్ తలపై ఇనుప రాడ్డుతో కొట్టింది బిందియా. ఇరువురి మధ్య వాదన మొదలైంది. ఇది గమనించిన పొరుగింటి గౌరవ్.. భార్యాభర్తల గొడవలో కల్పించుకుని సర్దిచెప్పాడు. దినేశ్​ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు దినేశ్. తమ మధ్య ఇలాంటి గొడవలు జరగడం ఇది తొలిసారేం కాదు అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇలాంటివి ఎన్నో...

ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. చికెన్​ వండేందుకు నిరాకరించిందని.. ఓ వ్యక్తి భార్యను కర్రతో కొట్టి హత్య చేశాడు. చిత్రంగా ఉన్న ఈ ఘటనలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేసి చదివేయండి..

ఇక, శ్రావణ మాసంలో భర్త చికెన్ తిన్నాడని ఓ భార్య చేసిన పని షాక్​కు గురి చేసింది. అసలు ఆమె ఏం చేసిందో.. ఇక్కడ క్లిక్ చేసి చదివేయండి..

ఇదీ చదవండి: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Sep 7, 2021, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.