ETV Bharat / bharat

'హింసను ప్రేరేపించే వార్తా ప్రసారాలపై చర్యలేవి?' - వార్త ప్రసారాలపై సుప్రీం కోర్టు

హింసను ప్రేరేపించే విధంగా ఉండే టెలివిజన్ కార్యక్రమాలను నిలిపివేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. తబ్లీగీ జమాత్​పై జరిగిన తప్పుడు ప్రసారాల నేపథ్యంలో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.

SC slams Centre
'హింస ప్రేరేపిత వార్త ప్రసారాలపై కఠిన చర్యలేవి?'
author img

By

Published : Jan 28, 2021, 7:39 PM IST

హింసను ప్రేరేపించే విధంగా ఉండే టెలివిజన్​ కార్యక్రమాలను నిలిపేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. గతేడాది దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్​ కార్యక్రమంపై పలు టీవీ ఛానళ్లు తప్పుడుగా ప్రసారం చేశాయంటూ జమియాత్​-ఉలామా-ఐ-హింద్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... సరైన సమాచారం ప్రజలకు అందించడం తప్పుకాదని, సమస్యంతా అది ప్రజలకు చేరవేసే విధానంలోనే ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో లైవ్​ షోలు, డిబేట్​లను నియంత్రించే అధికారం తమకు లేదని తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్​ మెహతా. ఈ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం... ఈ అంశంపై మూడు వారాల్లో అఫిడవిట్​ సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:అట్టడుగున ఆరోగ్య భారతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.