ETV Bharat / bharat

Bengal Violence: బంగాల్​ హింసపై సుప్రీంకు మమత సర్కార్​ - బంగాల్​లో ఎన్నికల అనంతరం హింసపై సీబీఐ

బంగాల్​లో చోటు చేసుకున్న హింసపై(West Bengal Violence) కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను వ్యతిరేకిస్తూ.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది.

mamata benarjee
మమతా బెనర్జీ
author img

By

Published : Sep 2, 2021, 8:00 AM IST

అసెంబ్లీ ఎన్నికల అనంతరం బంగాల్​లో చోటు చేసుకున్న హింసపై(West Bengal Violence) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణను వ్యతిరేకిస్తూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తోందని, నిష్పాక్షిక దర్యాప్తు జరగడం లేదని బంగాల్ ప్రభుత్వం ఆరోపించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసపై విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. హింసకు సంబంధించిన ఇతర కేసులపై విచారణ చేపట్టాలని సిట్‌ను ఆదేశించింది. ఆరు వారాల్లో ఈ రెండు సంస్థలు తమ నివేదికల్ని సమర్పించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.