ఉత్తర భారతంలో భారీ వర్షాల కారణంగా గంగ-యమునా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా నీటి మట్టం పెరగటం వల్ల త్రివేణి సంగమం అయిన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ నీట మునిగింది.
ఇరు నదులు ఉప్పొంగి ప్రవహించటం వల్ల ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దరగంజ్, సలోరి, బఘద, రాజ్‌పుర్, నైనీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో మొదటి అంతస్తు నీటిలో మునగటం వల్ల పైఅంతస్తులో తలదాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నడి వీధుల్లో పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
ప్రయాగ్‌రాజ్‌లో గంగా నది 84.73 మీటర్ల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు యమునా నది నైనీలో 83.88 మీటర్ల మేర ప్రవహిస్తోంది.
ఇదీ చూడండి: వైరల్: గంగా నది వరదలకు కుప్పకూలిన మసీదు