Vistara Flights Collision Averted : దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రమాదవశాత్తు ఒకే సమయంలో రెండు విమానాలు రన్‌వేపైకి వచ్చాయి. విస్తారాకు చెందిన ఒక విమానాన్ని ల్యాడింగ్‌కు అనుమతివ్వగా.. ఆ సంస్థకు చెందిన మరో విమానం అదే సమయంలో టేకాఫ్ అయ్యేందుకు పచ్చజెండా ఊపారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులు. ఆ తర్వాత ఈ తప్పిదాన్ని గమనించడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ జరిగింది
విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన VTI926 విమానం అహ్మదాబాద్ నుంచి దిల్లీ వస్తుంది. ఈ విమానం రన్‌వేపై 29L ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది. అనంతరం దీనిని రన్‌వేపై 29R ప్రాంతానికి రావాలంటూ ఎయిర్ కంట్రోలర్ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో దిల్లీ నుంచి బాగ్‌డోగరా వెళ్తున్న మరో విస్తారా విమానానికి 29R ప్రాంతం నుంచే టేకాఫ్ కోసం అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఈ తప్పిదాన్ని గమనించిన అధికారులు.. దిల్లీ నుంచి బాగ్‌డోగరా వెళ్తున్న VTI725 విస్తారా విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. ఈ సమయంలో రెండు విమానాల మధ్య దూరం కేవలం 1.8 కి.మీలే ఉంది.
"అహ్మదాబాద్ నుంచి వస్తున్న విమానానికి ఆదేశాలు ఇచ్చిన విషయం మర్చిపోయిన టవర్ కంట్రోలర్ అధికారి.. మరో విమానం టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత VTI926 విమానం పైలట్ నుంచి సమాచారం వచ్చింది. వెంటనే తప్పిదాన్ని గమనించిన కంట్రోలర్ VTI725 విమానం టేకాఫ్‌ను రద్దు చేశారు. సమయానికి విమానాన్ని టేకాఫ్ చేసి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది."
--అధికారులు
దర్యాప్తునకు ఆదేశించిన డీజీసీఏ
ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన డీజీసీఏ.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటనపై విస్తారా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాగ్‌డోగరా వెళ్తున్న విమానం టేకాఫ్‌ను అకస్మాత్తుగా రద్దు చేయడం వల్ల అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో రన్‌వేపైకి ఇతర విమానాలు, వాహనాలను అనుమతించరు. అలాగే, ఒక రన్‌వేపై విమానం టేకాఫ్ అవుతుంటే.. పక్కనే ఉన్న మరో రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు అనుమతించరని ఏటీసీ అధికారి తెలిపారు.
విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్‌లో మంటలు.. గాల్లో చక్కర్లు కొడుతూ..
కాలుతున్న వాసనతో విమానం అత్యవసర ల్యాండింగ్.. ఉల్లిపాయలే కారణం!