ETV Bharat / bharat

మావోయిస్టుల దాడి లైవ్ వీడియో.. గాల్లోకి ఎగిరిపడ్డ పోలీసుల బస్సు!

author img

By

Published : Apr 27, 2023, 3:39 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి తర్వాత దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 10 మంది పోలీసులు సహా మొత్తం 11 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా.. అప్రమత్తమైన మిగతా పోలీసులు మావోయిస్టులపై కాల్పులు జరిపారు. IED పేలుడు ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సులో గాల్లోకి ఎగిరి కింద పడిందని ఆ దృశ్యాలను చిత్రీకరించిన పోలీసులు చెప్పారు.

Dantewada Naxal attack
Dantewada Naxal attack
మావోయిస్టుల దాడి.. వెలుగులోకి IED పేలుడు దృశ్యాలు

ఛత్తీస్​గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం మావోయిస్టులు జరిపిన IED దాడిలో.. పది మంది డీఆర్​జీ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన వెంటనే పోలీసు కాన్వాయ్‌లో ఉన్న మరో వాహనం నుంచి మొబైల్‌ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం కూంబింగ్‌కు వెళ్లిన డీఆర్​జీ పోలీసు బలగాలు.. బుధవారం తిరిగి వస్తుండగా మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఈ దాడి జరిగిందని ఈ దృశ్యాలను చిత్రీకరించిన పోలీసులు తెలిపారు.

'కాన్వాయ్​లో 70 మంది పోలీసులు'
కాన్వాయ్‌లో మొత్తం ఏడు వాహనాలు ఉండగా, మూడో వాహనమైన మినీ బస్సు IED దాడికి గురైందని చెప్పారు. వాహనం ఒక్కసారిగా గాలిలోకి లేచి కింద పడిందని.. ఘటన జరిగిన వెంటనే అక్కడున్న మిగతా పోలీసులు పెద్దపెట్టున అరవడం వీడియోలో రికార్డ్ అయ్యింది. కాన్వాయ్‌లో మొత్తం 70 మంది డీఆర్​జీ పోలీసులు ఉన్నట్లు వీడియో రికార్డు చేసిన జవాను వివరించారు. మావోయిస్టులపై పోరాటం చేసేందుకు గిరిజనులకు శిక్షణ ఇచ్చి.. డీఆర్​జీ పోలీసుల హోదా కల్పించారు.

'ఒక్కో వాహనానికి 100 నుంచి 150 మీటర్ల దూరం'
దంతెవాడ ఘటనలో మినీ బస్సులో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారని.. ఒక్కరు కూడా బతకలేదని పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపగా.. మావోయిస్టుల వైపు నుంచి కూడా కాల్పుల శబ్ధం వినిపించిందని చెప్పారు. కొద్దిసేపటికి వారు అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని అంచనా వేశారు. వీడియోలో కాల్పుల శబ్ధం స్పష్టంగా వినిపించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కాన్వాయ్‌లో ఒక్కో వాహనానికి మధ్య వంద నుంచి 150 మీటర్ల దూరం ఉంటుందని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

భద్రతాపరంగా అనేక వైఫల్యాలు!
అయితే బుధవారం నాటి ఘటన వెనుక భద్రతాపరంగా అనేక వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు 70 మంది పోలీసు బలగాలు ఓ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు.. ముందుగా ఎందుకు తనిఖీలు చేపట్టలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోడ్డు నిర్మాణ సమయంలో అనేక గుంటలు తవ్వినట్లు ఘటన జరిగిన ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా గుంటల్లో IEDలను అమర్చే అవకాశం ఉన్నప్పటికీ.. ముందస్తుగా ఎందుకు తనిఖీలు జరపలేదనే వాదన వినిపిస్తోంది.

Dantewada Naxal attack
శవపేటిక మోస్తున్న ఛత్తీస్​గ​ఢ్​ సీఎం

మిన్నంటిన రోదనల మధ్య శవపేటిక మోసిన సీఎం
నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా సీఎం ఓ శవపేటికను మోశారు. విగతజీవులుగా మారిన డీఆర్​జీ పోలీసులను ఓ వాహనంలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఆ వాహనం వరకు ఆయన దానిని తీసుకెళ్లారు. ఈ సమయంలో మృతుల కుటుంబ సభ్యుల వేదన చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలు, కుటుంబసభ్యుల రోదనలు ఓవైపు.. 'భారత్‌ మాతాకీ జై' నినాదాలు మరోవైపు వినిపిస్తుండగా.. ఆ శవపేటికలను స్వస్థలాలకు తరలించారు. 'మరణించిన వారి త్యాగాలు వృథాగా పోవు. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు జరుపుతున్న పోరును మరింత తీవ్రం చేస్తాం' అని సీఎం బఘేల్​ వెల్లడించారు.

కూంబింగ్​ అయ్యాక తిరిగి వస్తుండగా..
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వారు మినీ బస్సులో తిరుగు పయనమయ్యారు. వారిపై దాడి చేసేందుకు అరన్‌పుర్‌-సమేలీ మధ్యలో ప్రధాన రహదారికి సమీపంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మాటు వేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే రోడ్డు మధ్యలో అమర్చిన ఐఈడీ బాంబులను పేల్చారు. ఈ పేలుడు దాటికి మినీ బస్సు తునాతునకలైంది. రోడ్డుపై పది అడుగుల లోతు గొయ్యి పడింది. బస్సులోని 10 మంది డీఆర్జీ పోలీసులు అక్కడికక్కడే మరణించారు. డ్రైవర్​ తీవ్ర గాయాలతో మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.