ETV Bharat / bharat

బంగాల్ దంగల్: నందిగ్రామ్​లో మళ్లీ ఆనాటి రక్తపాతం!

వామపక్షాల కాలంలో నందిగ్రామ్​లో చెలరేగిన హింస మళ్లీ పునరావృతం అవుతోందా? అంటే.. కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి స్థాయిలో కాకున్నా నందిగ్రామ్​లో పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉందని స్పష్టమవుతోంది. సువేందు అధికారి భాజపాలోకి ఫిరాయించిన తర్వాత ఇక్కడి గ్రామాలు రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది. తరచుగా జరిగే హింసాత్మక ఘటనలు.. నందిగ్రామ్ ప్రజల భయాందోళనకు కారణమవుతోంది.

Violence returns to Nandigram, threatens to break brittle peace
నందిగ్రామ్​లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
author img

By

Published : Feb 6, 2021, 6:26 PM IST

తుపాకీ శబ్దాలు, హింసాత్మక ఘటనలు, నిద్రలేని రాత్రులు... మొత్తంగా నందిగ్రామ్​లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమం నాటి చీకటి రోజులు మళ్లీ వెలుగుచూస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన సువేందు అధికారి... టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య ప్రత్యక్ష పోరాటానికి నందిగ్రామ్ వేదికగా నిలుస్తోంది. సువేందు నియోజకవర్గమైన నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించడం.. ఈ పరిస్థితులకు కారణమైంది. కొద్ది నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీ మద్దతుదారులు, భాజపా వర్గాల మధ్య హింస సర్వసాధారణమైపోయింది.

స్థానికుల గోడు

"మా ఇంటి వద్ద తరచుగా కాల్పుల శబ్దం వినిపిస్తోంది. గత మూడు రోజుల నుంచి మేం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం"

-శ్యామల్ మన్నా, నందిగ్రామ్ నివాసి

2007-08 మధ్య నందిగ్రామ్​లో జరిగిన భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో తన వదినను కోల్పోయాడు మన్నా. సువేందు భాజపాలో చేరిన తర్వాత మన్నా లాంటివారు ఎందరో ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ అలాంటి రక్తపాతం జరుగుతుందేమోనని భయపడుతున్నారు.

"గత రెండు వారాలుగా ప్రతిరోజు ఏదో ఓ ఘర్షణ జరుగుతుంది. గతంలో రాజకీయ హింస మాత్రమే ఉండేది. ఇప్పుడు మతపరమైన హింస కూడా చెలరేగుతోంది. పేలుళ్లు, తుపాకీ కాల్పులు మా నిద్రను చెరిపేస్తున్నాయి. ఇదంతా.. రక్తపాతంతో కూడిన నందిగ్రామ్ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది."

-శ్యామల్ మన్నా, నందిగ్రామ్ నివాసి

మన్నా మేనల్లుడు గోకుల్ సైతం ఇక్కడి పరిస్థితులపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తన భార్యా, పిల్లలను బయటకు పంపించడం కూడా ఆపేసినట్లు తెలిపాడు.

"ఇక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ప్రాంతాల్లో స్థిరపడాలని ఒక్కోసారి అనిపిస్తుంది. ఈ హింస వల్లే నా తల్లిని కోల్పోయా. ఆ భయంతోనే నా భార్య, పిల్లల్ని బయటకు పంపడం లేదు."

-గోకుల్, స్థానికుడు

ఆనాటి రక్తపాతం

అప్పటివరకు బంగాల్​లో ఓ మధ్యశ్రేణి పట్టణంగానే సుపరిచితమైన నందిగ్రామ్ పేరు.. 2007 తర్వాత దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. బంగాల్​ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఇక్కడ జరిగిన పరిణామాలు కారణమయ్యాయి. టీఎంసీ వ్యవస్థాపకురాలు, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆనాటి భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) ఏర్పాటు కోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయింది. నందిగ్రామ్​లో రక్తపాతానికి కారణమైంది. పది నెలలు సాగిన ఈ రాజకీయ హింసాకాండలో పలువురు మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. పోలీసు కాల్పుల్లో 14 మందితో పాటు మరెందరో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రాంతాల ప్రజలు హింస నుంచి తప్పించుకునేందుకు గ్రామాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. రోడ్లపై గుంతలు తవ్వి ఎవరూ రాకుండా ఆపేశారు.

మళ్లీ ఇప్పుడు

మమత రంగప్రవేశంతో ఇక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లైంది. యాభై వేల ఓట్లతో దీదీని ఓడిస్తానని సువేందు సైతం శపథం చేయడం వల్ల.. నందిగ్రామ్ రాజకీయం వేడెక్కింది.

ఈ నేపథ్యంలో చీకటి రోజులు మళ్లీ మొదలయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గోకుల్​పుర్ గ్రామానికి చెందిన కవితా మాల్. 2007 హింసలో కవిత ఇంటికి దుండగులు నిప్పంటించారు.

"అప్పట్లో నాకు ఐదు బుల్లెట్ గాయాలయ్యాయి. దేవుడి దయవల్ల నేను బతికాను. 2011లో టీఎంసీ అధికారంలోకి రాగానే.. ఈ ప్రాంతం ప్రశాంతంగా మారిపోతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ హింస మళ్లీ మమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది."

-కవితా మాల్, గోకుల్​పుర్ నివాసి

తనతో పాటు తన కుటుంబ సభ్యులు రాత్రి వేళల్లో బయటకు వెళ్లడం మానేశారని సోమా ప్రధాన్(పేరు మార్చాం) అనే 45 ఏళ్ల మహిళ చెబుతున్నారు. 14 ఏళ్ల క్రితం జరిగిన ఆందోళనల్లో సోమాపై సామూహిక అత్యాచారం జరిగింది.

"ఈ పరిస్థితి మంచిది కాదు. మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు రాత్రి పూట గ్రామాల్లో సంచరిస్తున్నారని మా చుట్టుపక్కల వారు చెప్పారు."

-సోమా ప్రధాన్, స్థానికురాలు

గత కొద్ది వారాల్లో కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా పెరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. భాజపా, టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారని తెలిపారు.

"కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ పెద్దగా హింస చెలరేగిన ఘటనలు లేవు. కానీ రోజుల వ్యవధిలో ఇక్కడి పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చెదురుమొదురు ఘటన జరుగుతూనే ఉంది. కొన్ని ఘటనలైతే మా వరకు రావడం లేదు."

-పోలీసు అధికారి

తన సోదరుడితో కలిసి సువేందు భాజపాలో చేరిన తర్వాతే పరిస్థితులు నాటకీయంగా మారిపోయాయని ఇరుపార్టీల వర్గాలు భావిస్తున్నాయి. 'గత పదేళ్లుగా నందిగ్రామ్ సహా పరిసర గ్రామాలు టీఎంసీకి కంచుకోటలా ఉన్నాయి. ఎలాంటి ప్రత్యర్థులు లేరు. కానీ ఇప్పుడు మాత్రం టీఎంసీకి, ఫిరాయింపుదారులకు మధ్య పోటీలా మారింది. గ్రామాలు రెండుగా విడిపోయాయి' అని 'సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యునిస్టు)' స్థానిక నేత భవానీ ప్రసాద్ దాస్ చెప్పారు. భూసేకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా అత్యంత దూకుడు విధానాన్ని అవలంబించిన భూమి ఉచ్చేద్ ప్రతిరోధ్ కమిటీ(బీయూపీసీ)లో ఈయన కూడా భాగస్వామిగా ఉన్నారు.

నందిగ్రామ్​లోని గోకుల్​పుర్, గోకుల్​నగర్, గోపీమోహన్​పుర్, అధికారిపరా, హెరియా వంటి గ్రామాలు భాజపా వైపు మొగ్గుచూపుతుండగా.. సోనాచురా, హరిపుర్, ఖేజురీ, బృందావన్ ఛాక్, దౌడ్​పుర్, టెఖాలీ వంటి గ్రామాలు ఇప్పటికీ పాలకపక్షానికే విశ్వాసంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

పావుల్లా వాడుకున్నారు

ఇన్నేళ్లుగా అధికారి మినహా ఏ ఒక్క నేత కూడా తమ బాగోగుల గురించి పట్టించుకోలేదని రాధా రాణీ అరి(పేరు మార్చాం) అనే మహిళ చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనలో ఈ మహిళపైనా అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.

"సీపీఐ(ఎం) పాలనలో మమ్మల్ని పావులుగా వాడుకున్నారు. టీఎంసీ పాలనలోనూ హింస, అత్యాచారాలు రాజకీయ సాధనాలుగా మారిపోయాయి. స్థానికులమే దీనికి బలి అవుతున్నాం."

-రాధా రాణీ అరి, స్థానికురాలు

కొంత మంది పురుషులు కలిసి గ్రామాల్లో రాత్రి పూట కాపలా కాస్తున్నారని అధికారిపరా మండలానికి చెందిన జోయ్​దేవ్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం దుండగులు ఇంటి పైకప్పులకు నిప్పంటించారని చెప్పారు. ఆహార ధాన్యాలు, పౌల్ట్రీ ఫాంను లూటీ చేసినట్లు తెలిపారు.

ఇరుపార్టీలు ఏమంటున్నాయి?

సువేందు అధికారి, అతని అనుచరులు కలిసి శాంతియుతమైన వాతావరణాన్ని పాడు చేస్తున్నారని టీఎంసీ సీనియర్ నేత షేక్ సూఫియాన్ ఆరోపించారు. 'నందిగ్రామ్​లో భాజపా పేరే వినిపించదు. ఇక్కడ కాషాయ పార్టీ పుంజుకోవడానికి సువేందు సహకరించారు. నందిగ్రామ్​లో అరాచక పాలనను తీసుకురావాలని అనుకుంటున్నారు. దాన్ని ఎన్నటికీ జరగనివ్వం' అని చెప్పారు.

మరోవైపు, టీఎంసీనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని భాజపా ఎదురుదాడికి దిగుతోంది. ముస్లింలను సంతృప్తి పరిచే రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తోంది. నందిగ్రామ్​లో మతపరమైన ఘర్షణలకు టీఎంసీనే కారణమంటూ చెప్పుకొచ్చింది.

"టీఎంసీ తన బలంతో బయటి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ఉద్రిక్తతలకు పాల్పడుతోంది. పోలీసులు కేవలం ప్రేక్షకుల్లా మారిపోతున్నారు."

-భాజపా తామ్​లుక్ జిల్లా ప్రధాన కార్యదర్శి

గత అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు మెదినీపుర్​ జిల్లాలోని 16 స్థానాలను టీఎంసీ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో నందిగ్రామ్ కూడా ఒకటి. ఈసారి ఎన్నికలు ఏప్రిల్- మే నెలలో జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.