Young man running in Noida: ఓ యువకుడు అర్ధరాత్రి నోయిడా రహదారులపై ఆగకుండా పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒళ్లంతా చెమటలు పట్టినా.. దారిన వెళ్లేవారు లిఫ్ట్ ఇస్తామని చెప్పినా.. తన పరుగు ఆపకుండా వెళ్తున్న ఆ యువకుడి కథ విని నెటిజన్లు ఔరా అంటున్నారు.
అసలు ఆ యువకుడి కథేంటంటే?
Vinod Kapri viral tweet: ప్రముఖ డైరెక్టర్ వినోద్ కాప్రీ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో.. నోయిడా రహదారిపై తన కార్లో వెళ్తుండగా.. ఓ యువకుడు రోడ్డుపై పరిగెత్తుతూ కనిపిస్తాడు. ఎందుకు పరిగెడుతున్నావ్? అని యువకుడిని అడుగుతాడు. లిఫ్ట్ ఇస్తానంటే సున్నితంగా తిరస్కరిస్తాడు. వీటితో పాటు పలు ప్రశ్నలకు యువకుడు చెప్పిన సమాధానాలు విని.. 'నువ్వో బంగారం' అంటూ యువకుడిని డైరెక్టర్ మెచ్చుకుంటాడు. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు ఆ యువకుడు చెప్పిన సమాధానాలు విని.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.
-
This is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
">This is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQuThis is PURE GOLD❤️❤️
— Vinod Kapri (@vinodkapri) March 20, 2022
नोएडा की सड़क पर कल रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊 pic.twitter.com/kjBcLS5CQu
వినోద్ కాప్రీ: ఇక్కడకు రా.. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాను
యువకుడు: లేదు లేదు. నేను ఇలాగే పరిగెత్తుకుంటూ వెళ్తా.
వినోద్ కాప్రీ: ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావ్? ఎక్కడ పనిచేస్తావ్?
యువకుడు: నేను పరిగెత్తుకుంటూనే వెళ్తా. సెక్టార్ 16లోని మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తా. పరిగెత్తేందుకు నాకు ఇప్పుడే సమయం దొరుకుతుంది. ఆర్మీలో చేరేందుకు నేను పరిగెడుతున్నా. పొద్దున పరిగెత్తేందుకు నాకు సమయం దొరకదు. ఇంట్లో వంట, ఇతర పునులు పూర్తి చేసుకొని మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
వినోద్ కాప్రీ: నీ పేరేంటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
యువకుడు: నా పేరు ప్రదీప్ మెహ్రా. మా స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని అల్మోడా. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. ఆస్పత్రిలో ఉంది. నేను నా సోదరుడితో కలిసి ఇక్కడ ఉంటున్నా.
వైరల్ అవుతుందని చెప్పినా..
లిఫ్ట్ ఇస్తానంటే వద్దన్న యువకుడిని.. కనీసం డిన్నర్ కోసమైనా తన ఇంటికి రావాలని వినోద్ కాప్రీ అడిగారు. అయితే, తన సోదరుడు నైట్ డ్యూటీకి వెళ్తాడని, త్వరగా ఇంటికి చేరుకుని ఇద్దరి కోసం తనే వంట చేయాలని ప్రదీప్ చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతుందని డైరెక్టర్ చెబితే.. నన్నెవరు గుర్తుపడతారు అంటూ నవ్వుతూ చెప్పాడు. ఒకవైళ వైరల్ అయినా.. తానేమీ తప్పు చేయడం లేదు కదా అంటూ బదులిచ్చాడు.
సెలెబ్రిటీల స్పందన...
లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఎన్ని కష్టాలు ఉన్నా.. దృఢ నిశ్చయంతో తన లక్ష్యం కోసం పరితపిస్తుండటం చూసి సెల్యూట్ చేస్తున్నారు. విజేతలు ఇలాగే తయారవుతారంటూ మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ ట్వీట్ చేయగా.. ప్రదీప్ దేశానికి కాబోయే హీరో అంటూ మధ్యప్రదేశ్ పన్నా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా ప్రశంసించారు. ప్రదీప్‌కు అభినందనలు అంటూ నటి కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సైతం ప్రదీప్ కథ ఎంతో ప్రేరణగా ఉందంటూ వీడియోను షేర్ చేశారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా తిరిగిచ్చిన పురాతన వస్తువులను పరిశీలించిన మోదీ