Yogi Adityanath Sister Shop : ఓ చిన్న గ్రామంలోని వార్డ్ మెంబర్ కుటుంబ సభ్యులే.. కార్లలో తిరుగుతూ ఆడంబరాలు ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో.. దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి సోదరైనా సాధారణంగా జీవిస్తున్నారు. ఆడంబర జీవితాన్ని కాకుండా ఓ చిన్న దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరామె? అని ఆలోచిస్తున్నారా! ఆమె ఎవరో కాదు.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి. ఆమె కథేంటో తెలుసుకుందాం..
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్ ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో నిరాడంబరంగా జీవిస్తున్నారు. మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో ఓ చిన్న టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడికి వెళ్లాలంటే.. గతుకుల రోడ్లపై అనేక కష్టాలు పడాలి. వర్షం పడిందంటే అక్కడికి వెళ్లడం చాలా కష్టం. ఆలయానికి 2 కిలోమీటర్ల ముందే వాహనాన్ని నిలిపి నడుస్తూ వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్నారు యోగి సోదరి శశి పాయల్. ఇటీవల భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్లిన పర్యటకులు.. ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఫొటోలు దిగారు. యోగితో చిన్నతనంలో ఆమెకు ఉన్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి.. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'ఉత్తర్‌ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే.. ఆమె ఓ చిన్న టీ షాపు నడుపుతూ జీవిస్తున్నారు. తన సోదరుడు రాష్ట్ర సీఎం అనే.. గర్వం ఆమెలో కొంచెం కూడా లేదు' అని పర్యటకులు చెప్పారు. అనేక మంది పర్యటకులకు ఇక్కడికి వచ్చే వరకు ఈ విషయం గురించి తెలియదని తెలిపారు. తనకు సంబంధించిన అనేక విషయాలు తమతో పంచుకున్నారని చెప్పారు.
-
कुछ दर्शनार्थी गए थे माता जी का दर्शन करने और उन्हें क्या पता था कि इतनी दुर्गम रास्तों से जाने वाले स्थान पर एक छोटी सी चाय की टपरी लगाए हुए देश के शक्तिशाली नेताओं में से एक उत्तर प्रदेश के यशश्वी मुख्यमंत्री आदरणीय @myogiadityanath जी महाराज की सगी बहन उन्हें मिल जाएंगी।
— Dinesh Chaudhary (@dineshbjp09) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1/3 pic.twitter.com/JSWfv3fyU4
">कुछ दर्शनार्थी गए थे माता जी का दर्शन करने और उन्हें क्या पता था कि इतनी दुर्गम रास्तों से जाने वाले स्थान पर एक छोटी सी चाय की टपरी लगाए हुए देश के शक्तिशाली नेताओं में से एक उत्तर प्रदेश के यशश्वी मुख्यमंत्री आदरणीय @myogiadityanath जी महाराज की सगी बहन उन्हें मिल जाएंगी।
— Dinesh Chaudhary (@dineshbjp09) July 2, 2023
1/3 pic.twitter.com/JSWfv3fyU4कुछ दर्शनार्थी गए थे माता जी का दर्शन करने और उन्हें क्या पता था कि इतनी दुर्गम रास्तों से जाने वाले स्थान पर एक छोटी सी चाय की टपरी लगाए हुए देश के शक्तिशाली नेताओं में से एक उत्तर प्रदेश के यशश्वी मुख्यमंत्री आदरणीय @myogiadityanath जी महाराज की सगी बहन उन्हें मिल जाएंगी।
— Dinesh Chaudhary (@dineshbjp09) July 2, 2023
1/3 pic.twitter.com/JSWfv3fyU4
యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో జన్మించారు. ఆయనకు ఏడుగురు తోబుట్టువులు. అందులో పెద్దవారు శశి పాయల్ కాగా.. యోగి ఐదో సంతానం. శశి పాయల్.. కొఠార్ గ్రామానికి చెందిన పురాన్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ సన్యాసం తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ మఠానికి వెళ్లారు. శశి పాయల్.. తన భర్తతో కలిసి సుమారు రెండున్నర కిలోమీటర్లు ప్రతిరోజూ వెళ్లి.. ఓ చిన్న దుకాణం నడుపుతూ జీవిస్తున్నారు. 1994 ఆయన సన్యసించిన తర్వాత.. దాదాపు 28 ఏళ్లుగా యోగికి రాఖీ కట్టడం లేదు శశి. కానీ ప్రతి ఏడాది రక్షబంధన్కు కచ్చితంగా తన సోదరుడు యోగికి రాఖీని పంపిస్తుంటారు.