Vastu Tips to Arrange Lights in Diwali 2023: హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో.. దీపావళి ముందు వరుసలో ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా.. కుటుంబమంతా కలిసి ఆనందోత్సాహాల నడుమ ఉల్లాసంగా ఈ పండగను జరుపుకుంటారు. ఇళ్లన్నీ వెలుగులతో నిండిపోయే ఈ పండగను వాస్తు నియమాలు పాటిస్తూ జరుపుకోవాలని, అప్పుడే.. ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?
ఎక్కువ మంది భారతీయులు వాస్తును బలంగా నమ్ముతారు. ఇల్లు కట్టుకోవాలన్నా.. లేదా మరేదైనా నిర్మాణం చేపట్టాలన్నా.. ముందుగా చేసే పని వాస్తు పరిశీలన. ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే.. ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని.. వ్యక్తిగత జీవితం కూడా సజావుగా సాగిపోతుందని భావిస్తారు. అయితే కేవలం ఇంటి నిర్మాణం కోసమే కాకుండా.. దీపావళికి ఇంటిని శుభ్రం చేసే సమయంలోనూ, పండగ రోజు వెలిగించే దీపాల విషయంలోనూ వాస్తు అనుసరిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇంటిని శుభ్రం చేయాలి: పండగ రాబోతోందనగానే చాలా మంది ఇల్లు శుభ్రం చేసుకుంటారు. కానీ.. కొందరు పెద్దగా పట్టించుకోరు. వారిలో కొందరు తూతూ మంత్రంగా శుభ్రం చేస్తే.. మరికొందరు అస్సలే ఇంటిని శుభ్రం చేసుకోరు. ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. దీపావళి రోజున ఇంట్లోకి నూతన వెలుగులు వస్తాయి. ఈ వెలుగులు ఇంట్లో కొలువుండాలంటే.. తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరిగిపోయిన పాత దుస్తులు, పగిలిన ప్లేట్లు, అద్దాలు వంటివి ఇంట్లో నుంచి తీసి వేసి.. పూర్తిగా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ విధంగా.. చెడును వదిలించుకొని, మంచిని స్వాగతించాలని సూచిస్తున్నారు.
దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి!
ఏ దిశలో ఏ రంగుల దీపాలు పెట్టాలి..?: దీపావళి నాడు దీపాలతోపాటు.. రంగు రంగుల ఫెయిరీ లైట్లు, బల్బులు, డిజైనర్ ల్యాంప్స్ మొదలైనవాటిని ఇంటి అలంకరణ కోసం ఎంచుకుంటారు. అయితే.. ఏ రంగు లైట్లు ఏ దిశలో పెట్టాలనే విషయంలోనూ వాస్తు పనిచేస్తుందట. కొన్ని దిశలకు కొన్ని రంగులు అనుకూలంగా ఉంటాయట. అవి ఏంటంటే..
- ఇంటికి తూర్పు దిశలో ఎరుపు, పసుపు, నారింజ వంటి రంగుల లైట్లు శుభసూచకంగా ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
- పశ్చిమ దిశలో పసుపు, నారింజ, గులాబిరంగు లైట్లతో అలంకరిస్తే మంచి జరుగుతుందట.
- నీలం, పసుపు, ఆకుపచ్చ దీపాలను ఉత్తర దిశలో పెడితే చాలా మంచిదని చెబుతున్నారు.
- ఇక దక్షిణ దిశ వైపు లైట్లు పెట్టడానికి తెలుపు, వైలెట్ రంగులను ఎంచుకుంటే మంచిదట.
- ఈ దీపావళి పండగ వేళ ఇంటిని శుభ్రం చేయడంతోపాటు.. ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించి.. ఇంటిని కాంతివంతంగా మార్చుకోవాలని, పండగను ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు.
దీపావళి రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే.. సిరిసంపదలు మీ సొంతం!
దీపావళి స్పెషల్ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!