ETV Bharat / bharat

'టీకాలు లేవు.. మే1 నుంచి వ్యాక్సినేషన్​​ చేపట్టలేం' - 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్​

టీకాల కొరత కారణంగో 18 ఏళ్లు పైబడిన వారికి మే1 నుంచి వ్యాక్సినేషన్​ చేపట్టలేమని తెలిపింది మహారాష్ట్ర. ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే ఉచితంగా అందిస్తామని, ప్రైవేటు కేంద్రాల్లో పౌరులే టీకా ఖర్చు బరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరో 15 రోజులు లాక్​డౌన్​ పొడిగించింది.

Rajesh Tope
ఆరోగ్య మంత్రి రాజేశ్​ టోపే
author img

By

Published : Apr 28, 2021, 5:31 PM IST

దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారికి మే1 నుంచి కొవిడ్​ టీకా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్​ను ప్రారంభించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సరిపడా టీకా డోసులు అందుబాటులో లేకపోవటమే ఇందుకు కారణంగా వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యాక్సినేషన్​ కేంద్రాల్లో 18-44 ఏళ్ల వారికి ఉచితంగా టీకా అందిస్తామని ఆరోగ్య మంత్రి రాజేశ్​ టోపే తెలిపారు. ప్రైవేట్​ కేంద్రాల్లో పౌరులే టీకా రుసుములు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉచిత టీకా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో డోసుల కొరతతో చాలా మంది పౌరులకు టీకా అందకపోవచ్చన్న నివేదికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు.. ఏప్రిల్​ 28 ఉదయం నాటికి మహారాష్ట్రకు మొత్తం 1,58,62,470 డోసులు అందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంకా 5 లక్షల డోసులు మిగులు ఉన్నట్లు స్పష్టం చేసింది. మరో 5 లక్షల డోసులు వచ్చే మూడు రోజుల్లో పంపుతామని వెల్లడించింది.

లాక్​డౌన్​ పొడిగింపు..

మహారాష్ట్రలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతున్నందున మరో 15 రోజులు లాక్​డౌన్​ పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే 15 వరకు లాక్​డౌన్​ అమలవుతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి టోపే తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలో జరిగిన కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్​ 4న వారాంతపు లాక్​డౌన్​, రాత్రి కర్ఫ్యూ విధించింది మహారాష్ట్ర. ప్రైవేటు కార్యాలయాలు, సినిమా హాళ్లు, సెలూన్లు వంటి వాటిపై ఆంక్షలు విధించింది.

ఇదీ చూడండి: '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.