దేశంలో వ్యాక్సినేషన్(Vaccination in India) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో.. టీకా వేసేందుకు ప్రజల చెంతకే వైద్యులు వెళుతున్నారు. మారుమూల ప్రాంతాలను సైతం చేరుకుని టీకా వేస్తున్నారు. బాండిపుర్ జిల్లాలోని వులర్ సరస్సులో జాలర్లకు టీకా వేయడానికి వైద్య సిబ్బంది అక్కడకి వెళ్లారు. జాలర్లు చేపలు పడుతుండగానే టీకాలు ఇచ్చారు.
అదే క్రమంలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు వైద్యులు. కరోనా నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న వదంతులను నమ్మకూడదని చెబుతున్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
ట్రాన్స్జెండర్లకు..
ఒడిశాలోనూ టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. భువనేశ్వర్‌లో ట్రాన్స్జెండర్లకు (transgenders vaccination)సైతం వ్యాక్సిన్ పంపిణీ చేశారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎమ్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాక్సిన్ డ్రైవ్‌లో దాదాపు 500మంది ట్రాన్‌జెండర్లు టీకా వేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేనివారికి సైతం వ్యాక్సిన్ అందించారు. దీనిపై ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి:6-12 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!