'హైకమాండ్ నిర్ణయంతో..'
పార్టీ అధిష్ఠానం నిర్ణయంతోనే తాను పదవి నుంచి తప్పుకున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం.. గవర్నర్ రాణి మౌర్యను కలిసిన ఆయన.. రాజీనామా లేఖను అందించారు. సీఎం బాధ్యతలు చేపడతానని తాను ఎన్నడూ అనుకోలేదని.. కానీ నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే అవకాశం దక్కిందన్నారు.
భాజపా శాసనసభా పక్ష సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు జరుగుతుందని వెల్లడించారు త్రివేంద్ర.