ETV Bharat / bharat

ప్రేమించిందని.. కోడలిని కడతేర్చిన మేనమామలు - ఉత్తర్​ప్రదేశ్ పరువు హత్య కేసు

ప్రేమించిందన్న కారణంతో 16 ఏళ్ల యువతి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య(up killing news) చేసిన ఘటన వెలుగుచూసింది. మేనమామలే ఈ ఘాతూకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో యువతి మేనమామ సహా.. మృతురాలి ప్రియుడు సిరాజ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

girl murder
యువతి హత్య
author img

By

Published : Nov 25, 2021, 11:11 AM IST

Updated : Nov 25, 2021, 11:21 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. 16 ఏళ్ల యువతిని మేనమామలే అమానుషంగా హతమార్చిన(up murder news today) ఘటన సంచలనం సృష్టించింది. ఓ వ్యక్తిని ప్రేమించిందన్న(up honour killings news) కారణంతో ఆమె గొంతుకోసి హత్య చేశారు. బారాబంకి(barabanki murder news) జిల్లా.. అసంద్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.

ఇదీ జరిగింది..

ఇంటి బయట ఉన్న గుడిసెలో నిద్రించేందుకు వెళ్లిన యువతి మరుసటి రోజు ఉదయం చాలా సేపటి వరకు బయటకు రాలేదు. దీనితో ఆమెను నిద్రలేపేందుకు తన సోదరి వెళ్లింది. అక్కడ ఆ యువతి నిర్జీవంగా పడింది. అక్కడి దృశ్యాలు చూసి గందరగోళానికి గురైంది. మృతురాలి(uttar pradesh honour killing) సోదరుడి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ నివేదిక ప్రకారం ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు తేలిందని ఏఎస్​పీ మనోజ్ కుమార్ పాండే వివరించారు.

మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనమామ(girl murdered by uncle) రామ్‌కిషోర్​ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో మేనమామ లాల్ బహదూర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. యువతిని ప్రేమించిన సిరాజ్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఘటనకు ముందే ఉద్రిక్తత..

వేరే కులం అతడిని ప్రేమించిందన్న కారణంతో తన సోదరులు ఆగ్రహంతో ఉన్నారని యువతి తల్లి గుర్తించింది. దీనితో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పరిస్థితి తీవ్రతను అంచనా వేసింది కూడా. ఘటన జరగడానికి ముందే వారిద్దరినీ అప్రమత్తం చేసింది. దీనితో సిరాజ్ అక్కడినుంచి పారిపోయాడు.

అనంతరం యువతి తల్లి ఇంట్లో నిద్రిస్తుండగా.. గుడిసెలో పడుకున్న యువతి మేనమామలిద్దరూ ఆమె గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Nov 25, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.