Uttarkashi Tunnel Rescue Update : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఓ సభ్యుడు చక్రాలు ఉన్న స్ట్రెచర్‌పై పడుకొని పైపు చివరి వరకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు. శిథిలాల గుండా వేసిన 800 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగిన పైపులోనికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి గాలి పీల్చడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. చక్రాల ఉన్న స్ట్రెచర్‌పైన విడతల వారీగా ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. పైపులో నుంచి కార్మికులను తీసుకొచ్చే సమయంలో వారికి ఎటువంటి గాయాలు కాకూడదనే ఉద్దేశంతోనే స్ట్రెచర్‌లను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
-
VIDEO | NDRF demonstrates movement of wheeled stretchers through the pipeline, for rescue of 41 workers trapped inside #SilkyaraTunnel once the horizontal pipe reaches the other side. @NDRFHQ #UttarakhandTunnelRescue #UttarakhandTunnelCollapse pic.twitter.com/ubAojLsRXJ
— Press Trust of India (@PTI_News) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | NDRF demonstrates movement of wheeled stretchers through the pipeline, for rescue of 41 workers trapped inside #SilkyaraTunnel once the horizontal pipe reaches the other side. @NDRFHQ #UttarakhandTunnelRescue #UttarakhandTunnelCollapse pic.twitter.com/ubAojLsRXJ
— Press Trust of India (@PTI_News) November 24, 2023VIDEO | NDRF demonstrates movement of wheeled stretchers through the pipeline, for rescue of 41 workers trapped inside #SilkyaraTunnel once the horizontal pipe reaches the other side. @NDRFHQ #UttarakhandTunnelRescue #UttarakhandTunnelCollapse pic.twitter.com/ubAojLsRXJ
— Press Trust of India (@PTI_News) November 24, 2023
మరోవైపు సొరంగం డ్రిల్లింగ్ పనుల్లో శుక్రవారం ఎలాంటి పురోగతి లేదని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వీలైనంత త్వరగా అగర్ మిషన్‌తో డ్రిల్లింగ్ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. గురువారం పనులు నిలిచిన తర్వాత ఎలాంటి పురోగతి లేదని.. ఇంకా సుమారు 15 మీటర్లు దూరం డ్రిల్లింగ్ చేయాల్సి ఉందని చెప్పింది. అగర్ మిషన్ గంటకు 4-5 మీటర్ల దూరం డ్రిల్లింగ్ చేస్తుందని వివరించింది. ఆపరేషన్ పూర్తయ్యే సమయంపై మీడియా అవాస్తవాలు ప్రసారం చేయెద్దని కోరింది. గురువారం సాయంత్రం డ్రిల్లింగ్ చేసే యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అధికారులు శిథిలాలను తొలగించే పనిని నిలిపివేశారు. మరోవైపు సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా 40 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ప్రమాద ఘటనకు సమీప ప్రాంతంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.
-
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Food being packed for the 41 workers who are trapped inside pic.twitter.com/jQAOEyvjiw
— ANI (@ANI) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Food being packed for the 41 workers who are trapped inside pic.twitter.com/jQAOEyvjiw
— ANI (@ANI) November 24, 2023#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Food being packed for the 41 workers who are trapped inside pic.twitter.com/jQAOEyvjiw
— ANI (@ANI) November 24, 2023
సొరంగంలోకి లూడో, చెస్ బోర్డ్‌గేమ్స్..
సొరంగం లోపల ఉన్న కార్మికులు ఒత్తిడిని అధిగమించేందుకు వారికి చెస్, లూడో వంటి బోర్డ్ గేమ్స్ అందివ్వనున్నట్లు సహాయ బృందంలోని మానసిక వైద్యుడు డాక్టర్ రోహిత్ గోండ్వాల్ తెలిపారు. "సొరంగంలో చిక్కుకున్న కార్మికులు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం లోపల ఉన్నవారంతా బాగానే ఉన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా కూడా చేస్తున్నట్లు వాళ్లు మాతో చెప్పారు. దీంతోపాటు వారికి కొన్ని బోర్డ్ గేమ్స్ కూడా పంపిస్తాము" అని డాక్టర్ రోహిత్ గోండ్వాల్ వివరించారు. మరోవైపు కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ మధ్యప్రదేశ్‌లోని మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు చేశారు.
-
#WATCH | Madhya Pradesh: Priests at the Mahakaleshwar temple in Ujjain, offered special prayers for the safety of 41 workers trapped inside the Silkyara Tunnel in Uttarkashi, Uttarakhand pic.twitter.com/1FDIBODr3y
— ANI (@ANI) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Madhya Pradesh: Priests at the Mahakaleshwar temple in Ujjain, offered special prayers for the safety of 41 workers trapped inside the Silkyara Tunnel in Uttarkashi, Uttarakhand pic.twitter.com/1FDIBODr3y
— ANI (@ANI) November 24, 2023#WATCH | Madhya Pradesh: Priests at the Mahakaleshwar temple in Ujjain, offered special prayers for the safety of 41 workers trapped inside the Silkyara Tunnel in Uttarkashi, Uttarakhand pic.twitter.com/1FDIBODr3y
— ANI (@ANI) November 24, 2023
అగర్ యంత్రంలో సమస్యలు- సహాయక చర్యలకు అంతరాయం, కూలీల వెలికితీత మరింత ఆలస్యం!
మరి కొద్ది గంటల్లో సొరంగం నుంచి కార్మికులు బయటకు- 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం, ఘటనాస్థలికి సీఎం