ETV Bharat / bharat

ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు- ఎండీపై కేసు - మనీశ్​ మహేశ్వరిపై మరో కేసు

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపిస్తూ ట్విట్టర్​ తన వెబ్​సైట్​లో తప్పుడు మ్యాప్​ ప్రదర్శించడంపై ఆ సంస్థ ఎండీ మనీశ్‌ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. భజరంగ్​దళ్​ కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుజ్రానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఆయనపై అధికారులు కేసు నమోదు చేశారు.

FIR against Twitter
ట్విట్టర్​పై మరో కేసు
author img

By

Published : Jun 29, 2021, 2:35 PM IST

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ భారత విభాగం ఎండీ మనీశ్‌ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్‌సైట్లో ఓ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్‌ సీనియర్‌ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని ఖుజ్రానగర్‌ పోలీసు స్టేషన్‌లో భజరంగ్‌దళ్‌ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీశ్‌ మహేశ్వరితో పాటు న్యూస్‌ పార్టనర్‌షిప్స్‌ హెడ్‌ అమృతా త్రిపాఠీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్‌ను ట్విట్టర్‌ సోమవారం తన వెబ్‌సైట్లో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమ సంస్థపై విమర్శలతో విరుచుకుపడ్డ నెటిజన్లు 'ట్విట్టర్‌ బ్యాన్‌' అంటూ వేలకొద్దీ పోస్టులు చేశారు. దీంతో స్పందించిన ట్విట్టర్‌.. కొన్ని గంటల్లోనే ఆ మ్యాప్‌ను తొలగించింది.

అయితే దేశ భౌగోళిక సరిహద్దులను ట్విట్టర్‌ ఇలా తప్పుగా చూపడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ఏమాత్రం అగౌరవపరిచినా సహించేది లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది.

రెండో కేసు..

ట్విట్టర్‌ ఎండీ మనీశ్ మహేశ్వరిపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ భారత్‌లో ట్విట్టర్‌ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యూపీలోని ఘాజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి ఘటనలో గతవారం అక్కడి పోలీసులు ట్విట్టర్‌ ఎండీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. అయితే దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్‌ జారీ అయ్యింది. అయితే ట్విట్టర్‌ ఎండీకి రక్షణ కల్పిస్తూ హైకోర్టుకు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ యూపీ పోలీసులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్‌ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతాను ట్విట్టర్‌ కొంతసేపు నిలిపివేయడం వివాదాస్పదమైంది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రికి గంటపాటు ట్విట్టర్‌ యాక్సెస్‌ను నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరించింది. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖుల ఖాతాలకు వెరిఫైడ్‌ టిక్‌ మార్కులను తొలగించడం కూడా వివాదానికి దారితీసింది.

ఇదీ చూడండి: వివాదాస్పద మ్యాప్​ను తొలగించిన ట్విట్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.