ఐదు నెలల పసికందును హత్యాచారం చేసిన మేనమామకు ఉరిశిక్ష విధించింది ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని పోక్సో కోర్టు. అతడికి రూ.70వేల జరిమానా కూడా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి తండ్రికి అందజేయాలని ఆదేశించింది. ఈ శిక్షను హైకోర్టు ఖరారు చేశాక దోషిని ఉరి తీయాలని పేర్కొంది.
ఈ తీర్పు వెలువరిస్తూ జడ్జి అరవింద్ మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన క్రూర ఘటన అయినందున దోషికి ఉరిశిక్ష తప్ప ఇతర శిక్ష విధించేందుకు నిరాకరించారు.
"జంతువులు కూడా ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడవు. మనదేశంలో చిన్నారులను దైవ స్వరూపులుగా భావిస్తారు. నవరాత్రి సమయంలో దుర్గామాత అవతారంలో ఉన్న బాలికలను పూజిస్తారు. వాళ్లకు ఆహారం పెట్టాకే భక్తులు ఉపవాసం విరమిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పసికందును అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత అరుదైన కేసుగా పరిగణిస్తున్నాం. ఈ దోషి నేరానికి పాల్పడిన తీరు చూస్తే మనవతా సంబంధాలను ప్రజలను విశ్వసించడం మానేస్తారు. సామాజిక నిర్మాణాన్ని ఇలాంటి ఘటనలు నాశనం చేస్తాయి."
జడ్జి, మిశ్రా.
చిన్నారిపై హత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు యూపీలోని మదియాన్ పోలీస్‌స్టేషన్‌లో 2020 ఫిబ్రవరి 17న ఎఫ్ఐర్ నమోదైంది.
ఇదీ చదవండి: 7 నెలల గర్భిణి అదిరే ఫీట్లు- మెరుపు వేగంతో కర్రసాము