ETV Bharat / bharat

ఇంటర్​ ఫలితాలు రిలీజ్​.. 59 ఏళ్ల వయసులో మాజీ మంత్రి పాస్​.. మాజీ ఎమ్యెల్యే సైతం.. - యూపీ ఇంటర్​ ఫలితాలు మాజీ మంత్రి పాస్​

59 ఏళ్ల వయసులో ఇంటర్​ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు మాజీ మంత్రి ప్రభుదయాల్​ వాల్మీకి. సమయం ఉంటే మరిన్ని ఉన్నత చదువులు చదువుతానని తెలిపారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్ర కూడా ఇంటర్​ అన్ని సెబ్జెక్టుల్లో పాసయ్యారు. ఎల్​ఎల్​బీ చదివి పేదవారికి సహాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.

up board ressults 2023
Etv Bharatup-board-result-2023-59-year-old-former-minister-prabhudayal-valmiki-former-mla-rajesj-mishra-passed-in-12th
author img

By

Published : Apr 26, 2023, 7:38 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో గత నెలలో జరిగిన ఇంటర్​ పరీక్షలు ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తమ కుటుంబసభ్యులతో కలిసి వారెంతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే, 59 ఏళ్ల వయసులో పరీక్షలు రాసిన మాజీ మంత్రి ప్రభుదయాల్​ వాల్మీకి సైతం ఉత్తీర్ణులయ్యారు. బరేలీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్ర సైతం అన్ని సబ్జెక్ట్​ల్లో పాసయ్యారు. మరోవైపు, ఓ విద్యార్థిని మాత్రం అన్ని సబ్జెక్టుల్లో కలిపి 402 మార్కులు సాధించినా.. ఫెయిల్​ అయినట్లు రిజల్ట్​ వచ్చింది.

టైమ్​ ఉంటే ఉన్నత చదువులు చదువుతా..
మీరఠ్​ జిల్లాలోని హస్తినపుర్​ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి, మంత్రిగా సేవలందించిన ప్రభుదయాల్​ వాల్మీకి.. 59 ఏళ్ల వయసులో ఎంతో ఉత్సాహంగా ఈ ఏడాది పరీక్షలు రాశారు. సెకెండ్​ క్లాస్​లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు. అంబేడ్కర్​ మాటలను స్ఫూర్తిగా తీసుకుని పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థి దశలో తనకు అనేక సమస్యలు ఎదురయ్యాయని, అందుకే అప్పుడు చదువుకోలేదని అన్నారు. మనసులో బలమైన కోరిక ఉంటే.. ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. సమయం ఉంటే మరిన్ని ఉన్నత కోర్సులు చదువుతానని స్పష్టం చేశారు. కానీ ఇంటర్​లో ఎన్ని మార్కులు వచ్చాయనేది చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

up-board-result-2023
ప్రభు దయాల్ వాల్మీకి

మీరఠ్ జిల్లాలో రాజకీయాల్లో ప్రభుదయాల్​ కీలక పాత్ర పోషించారు. వెస్ట్​ యూపీలోని వాల్మీకి సమాజ్‌కు చెందిన ప్రముఖ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రభుదయాళ్ చాలా కాలంగా సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) తరఫున యాక్టివ్‌గా ఉన్నారు. 2017లో ఎస్పీ టికెట్​పై పోటీ చేసి బీజేపీ అభ్యర్థి దినేశ్‌ ఖటిక్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో మళ్లీ ఆయనకు టికెట్‌ దక్కలేదు.

సెకెండ్​ క్లాస్​లో మాజీ ఎమ్మెల్యే పాస్​.. లాయర్​ అవ్వడమే టార్గెట్​
బరేలీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేశ్​ మిశ్ర అలియాస్​ పప్పు భరతోల్​ సైతం ఇంటర్​ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. సెకండ్​ క్లాస్​లో పాసైన రాజేశ్​ మిశ్ర.. తన కార్యకర్తలకు స్వీట్లు పంచారు. అయితే తనకు మూడు సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. రీకౌంటింగ్​ కోసం దరఖాస్తు చేస్తానని ఆయన తెలిపారు.

up-board-result-2023
ఇంటర్​ పరీక్షల్లో పాసైన రాజేశ్​ మిశ్రాకు స్వీట్లు తినిపిస్తున్న కార్యకర్తలు

బరేలీలోని బిత్రీ చైన్‌పుర్​ నుంచి గెలుపొందిన రాజేశ్​ మిశ్ర.. తన చదువు కొనసాగిస్తానని చెప్పారు. ఎల్‌ఎల్‌బీ చేసి పేదలకు సహాయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలు వింటూ.. చదువుకు సమయం కేటాయించి.. కష్టపడి ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్​లో ఉత్తీర్ణత సాధించిన రాజేశ్​.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు.

402 మార్కులు.. అయినా ఫెయిల్​!
అయితే అమేఠీకి చెందిన విద్యార్థినికి మాత్రం ఇంటర్​ బోర్డ్​ షాక్​ ఇచ్చింది. బోర్డు నిర్లక్ష్యం వల్ల ఆమె భవిష్యత్తు.. ప్రమాదంలో పడింది! అన్ని సబ్జెక్టులు కలిపి 402 మార్కులు తెచ్చుకున్న ఆ విద్యార్థిని ఫెయిలైనట్లు రిజల్ట్​​ వచ్చింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ బాధిత విద్యార్థిని.. ముఖ్యమంత్రికి విన్నవించింది.

అమేఠీలోని శ్రీ శివ ప్రతాప్ ఇంటర్ కాలేజ్‌లో చదువుకున్న బాధిత విద్యార్థిని అన్ని పరీక్షలు చక్కగా రాసింది. 402 మార్కులు తెచ్చుకుంది. కానీ ఫలితాల్లో మాత్రం ఫెయిల్​ అయినట్లు వచ్చింది. అయితే ప్రాక్టికల్స్​లో ఆమె సాధించిన 180 మార్కులకు బదులుగా 18 మార్కులు మాత్రమే యాడ్​ అయ్యియి. 402 మార్కులకు ప్రాక్టికల్స్​లో వచ్చిన 180 (18కి బదులు) మార్కులను కలిపితే మొత్తం 564 అవుతాయి. దీంతో ఆమెకు 94 శాతం మార్కులు వచ్చినట్లు అవుతుంది.

up-board-result-2023
402 మార్కులు వచ్చినా ఫెయిలైన విద్యార్థిని

ఈ విషయంపై ఆ కాలేజ్​ ప్రిన్సిపల్​ నవల్​ కిషోర్​ స్పందించారు. "ఆమెకు ప్రాక్టికల్స్​లో ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులు వచ్చాయి. సాంకేతిక తప్పిదాల వల్ల 30 మార్కులకు బదులుగా మూడు మార్కులు అని రిజల్ట్​లో వచ్చింది. ప్రాక్టికల్ మార్కులు 180కు బదులు 18 యాడ్​ అవ్వడం వల్ల ఆమె ఫెయిల్​ అయినట్లు వచ్చింది. ఇలా చాలా మంది విద్యార్థులకు జరిగింది" అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.