ETV Bharat / bharat

డీసీఎంను ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి.. మరో ఘటనలో ముగ్గురు.. - కన్నౌజ్​లో రోడ్డు ప్రమాదం

ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది ఓ బస్సు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ప్రమాదం. మరోవైపు, కన్నౌజ్​లో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

unnao road accident
డీసీఎంను ఢీకొట్టిన బస్సు
author img

By

Published : Jan 9, 2023, 12:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది ఓ బస్సు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఔరాస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం ఉదయం జరిగిందీ ప్రమాదం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఉన్నావ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు గుజరాత్​లోని రాజ్​కోట్ నుంచి లఖింపుర్​ ఖేరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

బోల్తా కొట్టిన బస్సు..
యూపీలోని కన్నౌజ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖ్​నవూ-ఆగ్రా ఎక్స్​ప్రెస్​వేపై దిల్లీ నుంచి వస్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 18 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

రాయ్​బరేలీకి చెందిన అనితా బాజ్‌పాయ్ (50), సంజన (25), దేవాన్ష్ (11) మృతి చెందారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తిరువాలోని ఆస్పత్రికి తరలించామని.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.