ETV Bharat / bharat

కోలుకుంటోన్న ఉన్నావ్​ బాధితురాలు - ఉన్నవ బాధితురాలి ఆరోగ్యం

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ కేసుకు సంబంధించిన బాధితురాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని పోలీసులు తెలిపారు. దీంతో వెంటిలేటర్​ తొలగించినట్లు పేర్కొన్నారు. ఉన్నావ్​ ఘటనలో మరో ఇద్దరు ఇప్పటికే చనిపోయారు.

Unnao case: Surviving minor girl's condition improves, taken off ventilator
కోలుకుంటోన్న ఉన్నవ్​ బాధితురాలు
author img

By

Published : Feb 20, 2021, 8:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ బాధితుల్లో ఇద్దరు చనిపోగా.. మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు కాన్పుర్​ పోలీసులు తెలిపారు. దీంతో వెంటిలేటర్​ను వైద్యులు తొలగించినట్లు పేర్కొన్నారు. బాలిక మాట్లాడే పరిస్థితుల్లో లేదన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కాన్పుర్ డిప్యూటీ ఐజీ ప్రీతేంధర్​ సింగ్​ తెలిపారు.

బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఆవరణలో పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. బాధితురాలి ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్​ బులిటెన్​ను విడుదల చేస్తున్నాయి. తొలుత బాలిక షాక్​కు గురైనట్లు వైద్యులు భావించారు. తరువాత ఆమె విషం తీసుకున్నట్లు అనుమానించారు. దీంతో వెంటిలేటర్​పై చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నట్లు హెల్త్​ బులిటెన్​లో వైద్యులు పేర్కొన్నారు.

ఉదిత్​ రాజ్​ ట్వీట్​పై కేసు నమోదు..

ఉన్నావ్​లో ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందడంపై కాంగ్రెస్​ నేత ఉదిత్​ రాజ్​ ట్వీట్​ చేశారు. అయితే ఈ ట్వీట్​ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్యాలను ప్రచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలపై అత్యాచారం జరిగిందని, వారి మృతదేహాలను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఉదిత్​ రాజ్​ ట్వీట్​ చేశారు.

ఇవీ చూడండి:

ఉన్నావ్​ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

భారీ భద్రత మధ్య ఉన్నావ్​ బాలికల అంత్యక్రియలు

పొలంలో ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.