College Reopen News: దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు ప్రత్యక్ష తరగతులను తిరిగి ప్రారంభించుకోవచ్చని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) వెల్లడించింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ తరగతులను కొనసాగించవచ్చని పేర్కొంది.
"రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కళాశాలలు, యూనివర్సిటీలు క్యాంపస్‌లను తెరవొచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లేదా రెండు రకాలుగా తరగతులు, పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కొవిడ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి" అని యూజీసీ తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్‌లైన్ తరగతుల నుంచి తిరిగి పాత విధానంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మారేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను సవరిస్తూ వస్తోంది.
ఇదీ చూడండి : కశ్మీర్లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి.. ఒకరు మృతి