ETV Bharat / bharat

బరువు తగ్గి రూ.2,300 కోట్లు రాబట్టిన ఎంపీ - నితిన్ గడ్కరీ సవాల్​

32 కిలోల బరువు తగ్గి రూ. 2,300 కోట్లు సంపాందించారు ఓ వ్యక్తి. ఇదేంటీ బరువు తగ్గితే అన్ని కోట్లు ఇస్తారా? అనుకుంటున్నారా! ఆ మధ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విసిరిన సవాల్​ స్వీకరించిన.. మధ్యప్రదేశ్​ ఉజ్జయిని ఎంపీ, భాజపా నేత అనిల్ ఫిరోజియా కేంద్రం నుంచి నియోజక అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు నిధులు సాధించారు.

Ujjain MP Anil Firojiya
వ్యాయామం చేస్తున్న ఎంపీ అనిల్ ఫిరోజియా
author img

By

Published : Oct 18, 2022, 3:42 PM IST

Ujjain MP Anil Firojiya : 'నువ్వు బరువు తగ్గితే.. నీ నియోజకవర్గ అభివృద్ధికి కేజీకి రూ.వెయ్యి కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తా' అంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విసిరిన సవాలు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని ఎంపీ అనిల్‌ ఫిరోజియాలో స్ఫూర్తిని నింపింది. వెంటనే కసరత్తులు ప్రారంభించి ఏడు నెలలు తిరిగేసరికల్లా 32 కిలోల బరువు తగ్గారు. ఫిబ్రవరిలో 127 కేజీలున్న అనిల్‌.. గత ఏడు నెలల్లో 32 కేజీలు తగ్గి 95 కేజీలకు చేరారు. 32 కిలోలు తగ్గడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.2,300 కోట్లను రాబట్టారు. ఆహారంలో అనేక మార్పులు చేసి.. సైక్లింగ్‌, యోగా వంటి కసరత్తులు చేశానని ఎంపీ అనిల్ ఫిరోజియా తెలిపారు. ఈ ప్రయత్నం ఇంతటితో విరమించనని.. మరింత బరువు తగ్గి తన నియోజకవర్గానికి మరిన్ని నిధులు సాధిస్తానని చెప్పారు.

"కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఇచ్చిన సవాల్​ను నేను స్వీకరించి 32 కిలోలు తగ్గాను. తాజాగా మంత్రిని కలిసి ఈ విషయం చెప్పగా.. ఆయన ఎంతో సంతోషించారు. ఆయన నాకు హామీ ఇచ్చిన విధంగానే రూ. 2,300 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఆమోదం తెలిపారు."

--అనిల్ ఫిరోజియా, ఉజ్జయిని ఎంపీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ.. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలోని మాల్వా ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అధిక బరువుతో ఉన్న ఎంపీ అనిల్ ఫిరోజియాను చూసి గడ్కరీ ఆశ్చర్యపోయారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. ఇందుకోసం ఎంపీకి ఓ సవాల్‌ కూడా విసిరారు. ''తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలంటూ అనిల్‌ తరచూ నన్ను డిమాండ్‌ చేస్తుంటారు. అయితే, అందుకు ఆయనకు నేనే షరతు పెట్టాను. నేను కూడా గతంలో 135 కేజీలు ఉండేవాడిని. ఇప్పుడు 93 కేజీలకు తగ్గాను. నా పాత ఫొటో కూడా చూపించాను. నా షరతు ఏంటంటే.. ఉజ్జయిని అభివృద్ధికి నిధులు కావాలంటే మీరు బరువు తగ్గాలి. ఎన్ని కేజీలు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తాను'' అని గడ్కరీ స్టేజీ మీదే చెప్పారు. దీంతో అప్పటి నుంచి అనిల్‌ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. యోగా, ఫిజికల్ వర్కౌట్లు, స్విమ్మింగ్‌ వంటివి చేస్తున్నారు. ఫిబ్రవరిలో 127 కేజీలున్న అనిల్‌.. గత ఏడు నెలల్లో 32 కేజీలు తగ్గి 95 కేజీలకు చేరారు.

ఇవీ చదవండి: 'బరువు తగ్గితే.. కేజీకి రూ.1000కోట్లు ఇస్తానన్నారు..'

'నా చాక్లెట్లు కొట్టేస్తోంది.. మా అమ్మను జైల్లో పెట్టండి'.. బుడ్డోడి ఫన్నీ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.