అసోం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ఉల్ఫా), అసోం ప్రభుత్వం మధ్య చర్చల వాతావరణం చిగురిస్తోంది. ఇటీవల జరిగిన పలు పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.
నూతన సీఎం హిమంత బిశ్వ శర్మ.. ప్రమాణస్వీకారం చేపట్టిన వెంటనే చర్చలకు పిలుపునిచ్చారు. దీనిపై ఉల్ఫా కమాండర్ ఇన్ చీఫ్ పరేశ్ బారువా(అలియాస్ పరేశ్ అసోం) సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను సురక్షితంగా తమ చెర నుంచి వదిలిపెట్టారు.
ఇదీ చదవండి- కిడ్నాపైన ఓఎన్జీసీ అధికారి విడుదల
'అర్థవంతంగా ఉండాలి'
ఈ నేపథ్యంలో 'ఈటీవీ భారత్' సీనియర్ రిపోర్టర్ గౌతమ్ బారువాతో ఫోన్లో మాట్లాడిన పరేశ్... చర్చల విషయమై నిర్దిష్టంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని అన్నారు. అయితే ఈ దిశగా ఆశాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సీఎం చర్చల పిలుపుపై ఆయన సానుకూలంగా మాట్లాడారు. హిమంత విజ్ఞప్తిని ప్రశంసించారు. చర్చలకు ఉల్ఫా ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే, అవి అర్థవంతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదో పేరుకు చర్చలు జరపకూడదని అన్నారు.
చైనా లేదా మయన్మార్ సరిహద్దులో పరేశ్ బారువా తలదాచుకుంటున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి- అనాథలకు అండగా సీఎం- రూ. 5లక్షల సాయం