ETV Bharat / bharat

ఇరవై లక్షలు ఖర్చు పెట్టి.. ఇంటిని పైకి లేపి.. - kerala house lifing

'ఇల్లే కదా స్వర్గ సీమ' అని పెద్దలు అంటారు. అలాంటి ఇల్లు వరదలు వచ్చిన ప్రతిసారి నడము లోతు నీటిలో మునిగిపోవడం చూడలేకపోయారు వారు. ఇప్పటికే రెండు సార్లు వరదల్లో చిక్కుకుని పోతే ఏమీ చేయలేకపోయారు. ఈ సారి ప్రకృతికి ఆ ఆవకాశం ఇవ్వకూడదని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఇంటిని సుమారు ఆరు అడుగుల మేర పైకి లేపారు. ఇదేదో ఆంజేయనేయుడు చేతితో పైకి లేపినట్లనుకుంటే పొరపాటే. నిర్మాణ రంగంలో పెరిగిన సాంకేతికతను ఉపయోగించి ఇనుప జాక్​ల సాయంతో ఈ పని చేశారు.

Kozhikode: Elevating houses to resist floods and waterlogging has witnessed a spurt in Kerala since the massive floods that hit the State in 2018. Recently, a two-storeyed house in Areekkara Koolimadu in Kozhikode district of Kerala has been lifted by a few feets from the ground level to resist the possible floods in future.    The house built fifteen years ago, owned by retired Sub Inspector Pushparaj and retired health Supervisor Indira, on Koolimadu Pulparambu Road, has been raised by more than 6 feet from the ground now.  During the floods in 2019, the couple’s house was under water for more than 7 and a half feet. The floods in 2018 and 2020 also had affected their house badly and the family had to move to a flood relief camp until the waters receded.    After going through the pain and trouble of post floods cleaning, replacing equipment, furniture and fixtures after every bout of inundation, the family decided to raise the house to a maximum possible height from the ground level so as to resist floods hereafter.    House lifting or elevation is the process of lifting a built-up house entirely - including pillars and beams - and evenly from the foundation using hydraulic or manual jacks. The house is separated from its foundation and then suspended on the jacks, while the works to securely place the structure on a raised foundation can be done underneath. The process is undertaken after a thorough structural investigation to determine the stability of the structure. The soil where it rests and other parameters are also checked. Then the workers start separating the foundation from the soil and slowly and evenly place the key parts of the structure on the jacks.   The couple spent about Rs 20 lakhs to elevate their house of 1900 square feet. As many as 200 jacks were used to elevate the structure. The house elevation contract was given to a native of Velliparambu in Kozhikode. The labourers were from Jharkhand and Haryana. The workers removed the granite stones in the foundation and placed jacks underneath. Presently, the work of filling soil under the raised part is underway.    After constructing a granite stone wall around the house, the soil has to be filled up to the raised level of the house. Until the works are over, Pushparajan and his family live in his sister’s house.    Though the whole process of house elevation is pretty expensive, it would be a huge relief from the floods affecting our family every now and then, Pushparajan says.
ఇరవై లక్షలు ఖర్చు పెట్టి.. ఇంటిని పైకి లేపి..
author img

By

Published : Jan 19, 2021, 7:32 PM IST

ఇరవై లక్షలు ఖర్చు పెట్టి.. ఇంటిని పైకి లేపి..

ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కట్టుకున్న పొదిరిల్లు.. వరదలు వచ్చినప్పుడల్లా నీట మునిగిపోతుంది. నివాసం ఉండే యజమానులు పునరావాస కేంద్రానికి తరలిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలనుకొన్నారు కేరళ కోజికోడ్​కు చెందిన పుష్పరాజ్​. మార్కెట్​లో ఉన్న నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 15ఏళ్ల కిందట నిర్మించిన తన రెండు అంతస్తుల ఇంటిని ఆరు అడుగుల మేర పైకి లేపారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపించినా తట్టుకునేలా తిరిగి పునాది నిర్మాణం చేపడుతున్నారు.

"2018, 2020లో వచ్చిన వరదలకు మా ఇల్లు మునిగి పోయింది. 15ఏళ్ల కిందట నిర్మించింది కావడం వల్ల బాగా దెబ్బతింది. 2019లో మా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సుమారు ఏడన్నర అడుగుల మేర నీరు చేరుకుంది. నడుము లోతు నీటిలో చిక్కకుపోయాం. మమ్మల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. చాలా మేరకు సామగ్రి ధ్వంసం అయ్యింది. అటువంటి ఇబ్బందికర అవస్థను మళ్లీ పడకూడదని ఇంటిని వీలైనంత మేర పైకి లేపాలి అనుకున్నాం."

- పుష్పరాజ్​, యజమాని

సాంకేతికతతో ముందడుగు..

ఇంటిని మొత్తాన్ని పైకి లేపడం అంటే సామన్యమైన ప్రక్రియ కాదు. బేస్​ నుంచి ఇంటిని వేరు చేయాలి. అంగుళం కూడా కదలకుండా యథాతథంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు ఎన్నో ఇనుప జాక్​లతో ఏకకాలంలో ఈ పని చేపట్టాలి. ఇలా చేసేందుకు కోజికోడ్​లోని ఓ సంస్థకు కాంట్రాక్ట్​ అప్పగించారు. ఇందుకు సంబంధించిన పని వారిని మాత్రం ఝార్ఖండ్​, హరియాణా నుంచి రప్పించారు.

"ఇంటిని అనుకున్న మేర పైకి లేపేందుకు స్థానికంగా ఉండే కంపెనీకి కాంట్రాక్ట్​ ఇచ్చాం. వారు ఇప్పుడు ఇంటిని బేస్​మెంట్​తో సంబంధం లేకుండా వేరు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూమికి, ఇంటికి మధ్య ఉండే భాగాన్ని తిరిగి మట్టితో నింపుతున్నారు. ఇంటి చుట్టుపక్కలా కాంక్రీట్​తో గోడ నిర్మిస్తున్నాం."

-పుష్పరాజ్​

20 లక్షలు వెచ్చించి..

పుష్పరాజ్​ దంపతులు ఈ పనికి సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 1900 చదరపు అడుగులు ఉండే ఈ ఇంటి కోసం 200 జాక్​లను కొనుగోలు చేశారు. నిజానికి అంత మొత్తం వెచ్చించి నిర్మించే కన్నా కొత్త ఇంటిని కొనుగోలు చేయవచ్చు. కానీ తమకు ఆ ఇంటి మీద ఉండే మమకారం అటువంటిదని అంటున్నారు.

ఇదీ చూడండి: రూపాయికే టిఫిన్​.. రూ.5కే భోజనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.