ETV Bharat / bharat

మరో రాష్ట్రంలో 'వైట్​ ఫంగస్​' కలకలం

హరియాణాలోని హిసార్​ సివిల్​ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు 'వైట్​ ఫంగస్'​ సోకినట్లుగా నిర్ధరణ అయింది. వారిద్దరినీ ఐసొలేషన్ వార్డుకు తరలించి యాంటీ ఫంగల్​ చికిత్స అందిస్తున్నారు.

white fungus
వైట్​ ఫంగస్
author img

By

Published : May 21, 2021, 1:33 PM IST

హరియాణాలో 'వైట్​ ఫంగస్​' కేసులు వెలుగు చూశాయి. హిసార్​ సివిల్ ​ఆస్పత్రిలో కొవిడ్​తో చికిత్స పొందుతున్న ఇద్దరు 60 ఏళ్లు దాటిన మహిళలకు ఈ వ్యాధి సోకినట్లుగా తేలింది. ఈ వైట్​ ఫంగస్​ బాధిత మహిళలిద్దరూ డయాబెటిస్​ వ్యాధిగ్రస్థులని అధికారులు తెలిపారు. వారిని ఐసొలేషన్​ వార్డుకు తరలించి, యాంటీ ఫంగల్​ చికిత్స అందిస్తున్నట్లుగా చెప్పారు.

ఇటీవలే బ్లాక్​ ఫంగస్​ వ్యాధిని 'నోటిఫయెబుల్​ డిసీజ్'​గా గుర్తిస్తూ హరియాణా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. అయితే.. బ్లాక్​ ఫంగస్​తో పోలిస్తే వైట్​ ఫంగస్​ తక్కువ ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: దేశంలో మరో కొత్త వ్యాధి.. ఈసారి వైట్​ ఫంగస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.