ETV Bharat / bharat

పిడుగుపాటుతో ఇద్దరు మృతి- సీఎం దిగ్భ్రాంతి - తాజా పిడుగుపాటు ఘటనలు

ఉత్తర్​ప్రదేశ్​లోని చిత్రకూట్​లో పిడుగుపాటు కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

Lightning strike
పిడుగుపాటు
author img

By

Published : May 3, 2021, 8:36 AM IST

యూపీలో అకాల వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. చిత్రకూట్​లోని మాణిక్​పుర్​ ప్రాంతంలో పిడుగుపాటుతో ఆదివారం ఇద్దరు మృతిచెందారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. మృతుల కుటుంబాలకు పరిహారం అందించడం సహా.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్​కు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: బ్రిటన్​ నుంచి భారత్​కు మరో 1000 వెంటిలేటర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.