ETV Bharat / bharat

జస్టిస్​ ఎన్.వి. రమణ పేరిట ట్విట్టర్​లో నకిలీ ఖాతా

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్​లో నకిలీ ఖాతాను తెరిచారు. అయితే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఖాతాను తొలగించింది ట్విట్టర్​. ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేఐ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

CJI N V Ramana
జస్టిస్​ ఎన్.వి. రమణ
author img

By

Published : Apr 27, 2021, 4:59 AM IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ పేరుతో ట్విట్టర్​లో నకిలీ ఖాతాను తెరిచారు కొందరు వ్యక్తులు. తన పేరిట ఈ ఖాతాను తెరిచి, వివిధ అంశాలపై ఇందులో పోస్టులు పెట్టడం సోమవారం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ట్విట్టర్​కు ఫిర్యాదు చేయగా.. వెంటనే దాన్ని తొలగించారు.

ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేఐ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి : 'ఆ ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు​ అమలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.