మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. భారత్‌లో.. దాదాపు గంట పాటు ట్విట్టర్లో పోస్టింగ్, సెర్చింగ్, కంటెంట్ షేరింగ్ చేయడంలో చాలా మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. గంట తర్వాత తమ సేవలను పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమం తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్య ఇంకా కొనసాగుతున్నట్లు వినియోగాదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
క్షమాపణలు..
ఈ అంతరాయానికి గల కారణం ఏమిటనే దానిపై ట్విట్టర్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఈ సమస్య ఏర్పడినందుకు క్షమాపణలు తెలిపింది. "వెబ్‌లో.. వినియోగదారుల ఖాతాల్లో ట్వీట్లు కనపడట్లేదు. సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నాం," అని ట్విట్టర్ సపోర్ట్ ట్వీట్ చేసింది. గంట తర్వాత.. సేవలు యథావిధిగా కొనసాగించొచ్చని తెలుపుతూ మరో ట్వీట్ చేసింది.
దాదాపు 6 వేలకు పైగా ట్విట్టర్ యూజర్లు.. మైక్రోబ్లాగింగ్ సైట్లో ఏర్పడిన సమస్యలపై కంప్లైంట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లోను ట్విట్టర్ ఈ సమస్యను ఎదుర్కొంది.
ఇదీ చదవండి: