ETV Bharat / bharat

TSPSC Group 1 prelims Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ప్రాథమిక కీ విడుదల - telangana group1 primary key

18869042
18869042
author img

By

Published : Jun 28, 2023, 8:03 PM IST

Updated : Jun 28, 2023, 8:32 PM IST

20:00 June 28

TSPSC Group 1 prelims Primary Key : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ప్రాథమిక కీ విడుదల

TSPSC Group 1 prelims Primary Key Release Today : టీఎస్​పీఎస్సీ గ్రూప్​-1 అభ్యర్థులకు శుభవార్త. టీఎస్​పీఎస్సీ గ్రూప్​-1 ప్రిలిమ్స్​ ప్రాథమిక కీను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్లను వెబ్​సైట్​లో టీఎస్​పీఎస్సీ ఉంచింది. జులై 1నుంచి జులై 5 వరకు ఆన్​లైన్​లో అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుందని కమిషన్​ చెప్పింది. అందుకే ఆన్​లైన్​లో ఆంగ్లంలో వచ్చిన అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో.. ఈ గ్రూప్​1 అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్​ షీట్లును కమిషన్​ ఉంచింది. 2,33,056 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్​పీఎస్సీ తెలిపింది. ఈ ఓఎంఆర్​ షీట్లు జులై 27 వరకు వెబ్​ సైట్​లో ఉంచనున్నట్లు పేర్కొంది.

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్​ 16న జరగాల్సిన గ్రూప్​1 పరీక్ష.. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్​ 11న టీఎస్​పీఎస్సీ పక్బంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TSPSC Group 1 Exam Primary Key : టీఎస్​పీఎస్సీ గ్రూప్​1 ప్రిలిమరీ ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ.. త్వరలోనే ప్రిలిమరీ ఫలితాలు విడుదల చేయనుంది. ఈ క్రతువును జులై తో ముగించనున్న టీఎస్​పీఎస్సీ.. ప్రధాన పరీక్షకు 3 నెలల సమయం ఇచ్చి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు​ లేదా నవంబరు నెలల్లో గ్రూప్​-1 ప్రధాన పరీక్ష ఉండనున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఇతర పరీక్షలు ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్​ 11న జరిగిన గ్రూప్​-1 పరీక్షను గతంలో రాసిన దానికంటే 50 వేల మంది తక్కువ రాసినట్లు టీఎస్​పీఎస్సీ పేర్కొంది. ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం గ్రూప్​-2,4 పరీక్షలకు సన్నద్ధం కావడంపై దృష్టి సారించడంతో ఈ పరీక్షను రాయలేదని అధికారులు భావిస్తున్నారు.

Group 1 Mains Exam In October or November : టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ తర్వాత కమిషన్​ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. కమిషన్​లో ఎవరైనా పరీక్ష రాస్తే.. వారికి నిర్బంధ సెలవులు ఇవ్వాలని తీర్మానించింది. గ్రూప్​-1 పరీక్షలో భద్రతా పరమైన కీలక అంశాలను ఎందుకు విస్మరించారని.. హైకోర్టు టీఎస్​పీఎస్సీని వివరణ కోరింది. బయో మెట్రిక్​ తీసుకోకపోవడం, ఓఎంఆర్​ షీట్​లో ఫొటో, సంతకం లేకపోవడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. గత అక్టోబరులో ఉన్న నిబంధనలు ఇప్పుడు ఎందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రిలిమ్స్​ రద్దు చేయాలన్న పిటిషన్​పై మూడు వారాల్లో పిటిషన్​ దాఖలు చేయాలని టీఎస్​పీఎస్సీని ఆదేశించింది.

ఇవీ చదవండి :

Last Updated : Jun 28, 2023, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.