రాజస్థాన్ సూరత్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజియాసర్ సమీపంలో గంగానగర్ వద్ద జాతీయ రహదారి-62పై ఓ ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


