త్రిపుర అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికల్లో భాజపా సారథ్వంలోని అధికారకూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికలకు కొన్నినెలల ముందు ఏర్పడిన కొత్త పార్టీ స్వదేశీ ప్రగతిశీల ప్రాంతీయ కూటమి (టీఐపీఆర్ఏ) 18 సీట్లు కైవసం చేసుకుంది. భాజపా 8 స్థానాలు, మిత్రపక్షం ఐ.పీ.ఎఫ్.టీ మరో స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌లు ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాయి. ఈనెల 6న మొత్తం 30 స్థానాలకుగాను 28 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. మిగితా ఇద్దర్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్న త్రిపురా రాజు ప్రద్యుత్ మాణిక్య దేవ్ బర్మన్ ఆ పార్టీకి రాజీనామా చేసి స్వదేశీ ప్రగతిశీల ప్రాంతీయ కూటమని ఏర్పాటు చేశారు.
త్రిపుర అటానమస్ డిస్ట్రిక్స్ కౌన్సిల్‌లోని 30స్థానాలు 20శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో జిల్లా కౌన్సిళ్ల పరిధిలోని 20స్థానాల్లో 18 సీట్లను భాజపా, దాని మిత్రపక్షం ఐ.పీ.ఎఫ్.టీ కైవసం చేసుకున్నాయి.
ఇదీ చూడండి: కూచ్ బిహార్ కాల్పులే ప్రచారాస్త్రం!