ETV Bharat / bharat

Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో బ్లాక్​(Black Fungus), వైట్​.. వంటి ఫంగస్​ ఇన్​ఫెక్షన్లు దాడి చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుకో కొత్త రంకం ఫంగస్​లు భయపడతున్నాయి. మరి ఈ వ్యాధికి వైద్య రంగంలో చికిత్స సాధ్యమేనా? వైద్యులు చెబుతున్నదేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Black fungus
బ్లాక్​, వైట్​ ఫంగస్​లు
author img

By

Published : Jun 10, 2021, 10:38 AM IST

కొవిడ్​-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను బ్లాక్​, వైట్​ ఫంగస్​లు భయబ్రాంతులకు గురుచేస్తున్నాయి. వీటితో ఒత్తిడికి లోనవుతున్నారు. బ్లాక్​ ఫంగస్​(Black fungus)తో ప్రధానంగా గుండె, ముక్కు, కళ్లు దెబ్బతింటున్నాయి. బ్లాక్​ ఫంగస్​తో పోలిస్తే.. వైట్​ ఫంగస్​ ఊపిరితిత్తుతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి ఈ ఫంగస్​లకు చికిత్స ఉందా? లేదా? వైద్యులు ఏం చెబుతున్నారు?(Black fungus treatment)

కొవిడ్​ బారినపడిన వారిపై పంజా విసురుతోన్న బ్లాక్(Black Fungus)​, వైట్​ ఫంగస్​లకు చికిత్స అందుబాటులో ఉందని భావిస్తున్నారు వైద్య నిపుణులు. అయితే.. అప్రమత్తంగా ఈ విషయంలో ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

"ఫంగస్​ అంటే కేవలం ఫంగసే. అది తెలుపు లేదా నలుపు అని కాదు. మ్యూకోర్​మైకోసిస్​ అనేది ఫంగల్​ ఇన్​ఫెక్షన్​. ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాల్లో నల్లటి మచ్చలు కనిపించటం వల్ల బ్లాక్​ ఫంగస్​ అంటారు. రంగులు ఇవ్వటం ప్రజలకు అర్థం కావటం కోసమే. తెలుపు ఫంగస్​(క్యాండిడియాసిస్​) కళ్లు, ముక్కు, గొంతుపై తక్కువగా ప్రభావం చూపుతుంది. నేరుగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఛాతీ, శ్లేష్మ.. హెచ్​ఆర్​సీటీ ఈ వ్యాధిని గుర్తించేందుకు సాయపడుతుంది.

స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో ఇస్తే.. బ్లాక్​ ఫంగస్​ బారినపడే అవకాశం ఉండదు. ఈ వ్యాధితో 50-80 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైట్​ ఫంగస్​తో మరణాలు నమోదు కాలేదు. బ్లాక్​ ఫంగస్​ కొత్తదేమీ కాదు. దీనికి చికిత్స అందుబాటులో ఉంది. యాంటీఫంగల్​​ ఔషధాలు ఇందులో ఉపయోగిస్తారు. మెడికల్​, సర్జికల్​ థెరఫీ ద్వారా చికిత్స అందించొచ్చు."

- డాక్టర్​. జ్యోతి బాజ్​పేయీ, కేజీఎంయూ అసిసెంట్​ ప్రొఫెసర్​.

ఆక్సిజన్​ పైపులు, హ్యూమిడిఫయర్స్​ శుభ్రంగా ఉంచుకావాలని సూచించారు జ్యోతి బాజ్​పేయీ. శరీరంలో షుగర్​ స్థాయిని అదుపులో ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. 'ఊపిరితిత్తులకు చేరే ఆక్సిజన్​ పరిశుభ్రమైనదిగా చూసుకోవాలి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. కానీ ఆందోళనకు గురికావొద్దు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, డయాబెటీస్​ వంటి తీవ్రమైన రోగాల బారిన పడినవారు, స్టెరాయిడ్స్​ ఎక్కువగా తీసుకునేవారే ఈ వ్యాధి బారినపడుతున్నారు. పూర్తిస్థాయిలో ఆక్సిజన్​పై ఆధారపడిన వారిలోనూ ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తోంది. ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో బ్లాక్​ ఫంగస్​ కనిపించటం లేదు' స్పష్టం చేశారు జ్యోతి.

ఇదీ చూడండి: Black Fungus: మెదడుకూ పాకిన వ్యాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.