ETV Bharat / bharat

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

Top Career Options In 2024 In Telugu : మీరు నిరుద్యోగులా? సంప్రదాయ ఉద్యోగాల కంటే, ఛాలెంజింగ్​ జాబ్స్ చేయడమంటే ఇష్టమా? అయితే ఇది మీ కోసమే. 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

job opportunities in 2024
Top career options in 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 11:11 AM IST

Top Career Options In 2024 : సాంకేతిక అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతున్న వేళ, దేశీయ పరిశ్రమల్లో అనేక కీలక మార్పులు వస్తున్నాయి. ఇవి సంప్రదాయ మార్గాలకు మించి, అనేక మంచి ఉద్యోగ అవకాశాలను ఆవిష్కరిస్తున్నాయి. నేటి యువత ఆశలకు, ఆసక్తులకు అనుగుణం ఉన్న ఈ ఉద్యోగ అవకాశాలు, వారి భవిష్యత్​కు మంచి దారి చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఆర్టికల్​లో 2024లో ఉన్న బెస్ట్ ఛాలెంజింగ్​ కెరీర్​ ఆప్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. Data Scientist​ : నేటి డిజిటల్ యుగాన్ని శాసించేది ఈ డేటా సైంటిస్టులే అని చెప్పకతప్పదు. వీరు సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి, వ్యాపార సమస్యలకు పరిష్కారాలు కనిపెడతారు. మరింత గొప్పగా ఆన్​లైన్ వ్యాపారం ఎలా చేయాలో తెలియజేస్తారు. అందుకే వీరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం డేటా సైంటిస్ట్​లు ఏటా సగటున రూ.14 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  2. AI & ML Engineer : భవిష్యత్​ మొత్తం ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (AI), మెషీన్ లెర్నింగ్​ (ML) మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఏఐ అండ్ ఎంఎల్ నిపుణులను నియమించుకుంటున్నాయి. వీరు కృత్రిమ మేథ సాయంతో ఆటోమేటిక్​గా పనులు పూర్తి చేసే అప్లికేషన్​లను రూపొందిస్తారు. ఫలితంగా తక్కువ శ్రమతో, పెద్ద మొత్తంలో ఉత్పత్తులు తయారుచేయడానికి, సేవలు అందించడానికి వీలవుతుంది. అందుకే నేడు ఏఐ అండ్ ఎంఎల్​ ఇంజినీర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతానికి వీరు సంవత్సరానికి సగటున రూ.11 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు జీతం పొందుతున్నారు.
  3. Digital Marketer : ఆన్​లైన్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసేది ఈ డిజిటల్ మార్కెటర్లే. వస్తు, సేవలను వివిధ వర్గాల కస్టమర్లకు చేరేవేసే బాధ్యత వీరిదే. ఇందుకోసం వీరు డిజిటల్ ఛానళ్లను, ఆన్​లైన్ ప్లాట్​ఫామ్​లను ఉపయోగిస్తూ ఉంటారు. పైగా నేడు అన్ని వ్యాపారాలు కూడా ఆన్​లైన్ ప్లాట్​ఫారమ్​లకు మారుతున్నాయి. అందుకే డిజిటల్ మార్కెటర్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం డిజిటల్​ మార్కెటర్లు - సీఈఓ, సోషల్ మీడియా, కంటెంట్​, ఈ-మెయిల్​ మార్కెటింగ్​ రంగాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వీరు ఏడాదికి సగటున రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  4. Cybersecurity Analyst : సాంకేతిక పెరుగుతున్న కొద్దీ, సైబర్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ అనలిస్టుల అవసరం ఎంతైనా ఉంటుంది. వీరు సైబర్ అటాక్​లను, సైబర్ ఫ్రాడ్​లను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఐటీ, డిఫెన్స్​, బ్యాంకింగ్​​ లాంటి వివిధ రంగాల్లో వీరిని నియమించుకుంటున్నారు. భవిష్యత్​లో వీరి అవసరం మరింత పెరగవచ్చు. ఇది కచ్చితంగా మంచి ఛాలెంజింగ్ జాబ్​ అవుతుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు సంవత్సరానికి సగటున రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారు.
  5. Prompt Engineer : నేడు చాట్​జీపీటీ, బర్డ్ లాంటి అనేక కృత్రిమ మేథస్సుతో పనిచేసే అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరైన కమాండ్స్ ఇస్తే, మంచి అవుట్​పుట్ ఇస్తాయి. ఇందుకోసం పనిచేసేవారే ప్రాంప్ట్ ఇంజినీర్లు. వీరు ఆర్టిఫీషిల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు అర్థం చేసుకునే విధంగా భాషా నమూనాలను రూపొందిస్తారు. దీనితో మంచి అవుట్​పుట్​ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాంప్ట్ ఇంజినీర్ జాబ్​ అనేది పరిశ్రమకు చాలా కొత్త. కానీ భవిష్యత్​లో వీరికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాంప్ట్ ఇంజినీర్లు ప్రస్తుతం ఏడాదికి సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సాలరీ పొందుతున్నారు.
  6. Green Specialist : నేడు ఆధునిక పరిశ్రమల వల్ల, మానవ తప్పిదాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. దీనిని అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు, సుస్థిరతకు గ్రీన్ స్పెషలిస్టుల అవసరం ఎంతైనా ఉంది. వీరు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, వ్యర్థాల నిర్వహణ, ఎనర్జీ, వేస్ట్ మేనేజ్​మెంట్​, పరిశోధన, కన్సల్టింగ్​, పాలసీ మేకింగ్​ల్లో కీలక పాత్ర వహిస్తారు. ప్రస్తుతం వీరి వార్షిక వేతనం సగటున రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.