ఉత్తర్ప్రదేశ్ బిల్లియా జిల్లాలో దారుణం జరిగింది. రెండేళ్ల పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డాడు 13 ఏళ్ల బాలుడు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామంలోని తమ బంధువులతో ఉంటుంది ఆ చిన్నారి. మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ.. పొరిగింటికి వెళ్లింది. అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. అయితే ఈ ఘటనకు ముందు నిందితుడు.. చరవాణిలో పోర్న్ చిత్రాలు చూశాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: పెళ్లి ట్రక్కు బోల్తా- ఐదుగురు దుర్మరణం