బంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్‌తో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు జగదీప్ ధన్‌ఖర్‌తో ఆమె భేటీ అవుతారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు అంశమై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.
గవర్నర్‌తో భేటీకి ముందే.. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు మమత.
ఇదీ చదవండి: 'బంగాల్ గడ్డపై అహంకారం, డబ్బు ఓడిపోయాయి'