ETV Bharat / bharat

నకిలీ వ్యాక్సిన్​తో ఎంపీ మిమీ చక్రవర్తికి అస్వస్థత

కోల్‌కతాలోని నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులో టీకా వేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమీ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమె.. కడుపునొప్పి, డీహైడ్రేషన్, లోబీపీతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. మిమీ చక్రవర్తినే గాక.. ఎంతో మంది ప్రజలు నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపు ద్వారా మోసపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజానిజాలను వెలికితీసేందుకు బంగాల్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

mimi chakravarthy
మిమీ చక్రవర్తికి నకిలీ వ్యాక్సిన్​
author img

By

Published : Jun 26, 2021, 10:55 PM IST

బోగస్ ఐఏఎస్ అధికారి చేతిలో తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ నటి మిమీ చక్రవర్తి మోసపోయారు. కోల్‌కతాలో దెవంజన్‌ దేవ్‌ అనే వ్యక్తి నడుపుతున్న... వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా తీసుకుని అస్వస్థతకు గురయ్యారు. కేఎంసీలో డిప్యూటీ కమిషనర్‌నని చెప్పుకుంటూ నగరంలోని కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని దెవంజన్‌ దేవ్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగుల కోసం నడుపుతున్న టీకా కేంద్రమని చెప్పి.. మిమీ చక్రవర్తిని దెవంజన్‌ ఆహ్వానించాడు.

త్వరలో వస్తుందంటూ..

అక్కడికి వెళ్లిన ఎంపీకి టీకా కేంద్రాన్ని చూపించిన దెవంజన్‌... అనంతరం అక్కడే మిమీ చక్రవర్తికి కూడా టీకా వేయించాడు. అయితే వ్యాక్సిన్ తీసుకుని... రెండురోజులు కావస్తున్నా ఇంకా టీకా ధ్రువపత్రం రాకపోవడం వల్ల మిమీ చక్రవర్తికి అనుమానం వచ్చింది. ఈ ధ్రువపత్రం విషయమై పలుమార్లు దెవంజన్‌తో మాట్లాడినా.. అతను త్వరలో వస్తుందని చెప్పి మాట దాటవేశాడు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు అటువంటి టీకా కేంద్రమేది లేదని తేల్చారు.

వైద్య పరీక్షల్లో..

మరోవైపు టీకా తీసుకున్న మిమీ చక్రవర్తి.. అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆమె.. కడుపునొప్పి, డీహైడ్రేషన్, లోబీపీతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇప్పటికే ఆమె గాల్ బ్లాడర్, కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మిమీ చక్రవర్తి ఫిర్యాదుతో నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై దర్యాప్తు చేసేందుకు బంగాల్‌ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ను ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారిని అంటూ నిందితుడు చాలామందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు.

ముగ్గురి అరెస్టు..

మరోవైపు నకిలీ టీకా వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని.. కేంద్ర ఆరోగ్యశాఖకు భాజపా ఎమ్మెల్యే సువేందు అధికారి లేఖ రాశారు. అటు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేశారు. నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులోని వస్తువులు, టీకాలు, శానిటైజర్ల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. నకిలీ వ్యాక్సినేషన్‌ వ్యవహారంలో కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌(కేఎంసీ) అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని కేఎంసీ ఛైర్మన్ ఫిర్హద్ హకీమ్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: PM Modi: టీకా పంపిణీపై మోదీ సమీక్ష

ఇదీ చూడండి: పసి పిల్లలకు కొవిడ్​-19 టీకా అవసరం లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.