బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే ప్రబీర్ఘోషల్... పార్టీలోని రెండు పదవులకు రాజీనామా చేశారు. హుగ్లీ జిల్లా కమిటీ నుంచి తప్పుకోవడమే కాక.. పార్టీ అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉత్తర్పారా నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
"వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తే.. ఓడించేందుకు కుట్ర జరుగుతోంది. నా నియోజకవర్గంలో నేను పోటీ చేయకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. అందుకే పార్టీ పదవులకు రాజీనామ చేశాను. నన్ను గెలిపించిన ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు."
- ప్రబీర్ ఘోషల్
పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్లే లోక్సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటలేకపోయిందని అన్నారు.
ఇదీ చూడండి: దిల్లీకి వెళ్లట్లేదు- టీఎంసీతోనే ఉంటా: శతాబ్ది రాయ్