ETV Bharat / bharat

తృణమూల్.. ఆల్ ఇండియా 'కాంగ్రెస్' అవుతోందా? - బంగాల్ రాజకీయ వార్తలు

బంగాల్​ ఎన్నికల్లో మోదీ, షా ద్వయాన్ని ఒంటిచేత్తో ఎదుర్కొని విజయదుందుబి మోగించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు(mamata banerjee news ). ఇప్పటికే పలు రాష్ట్రల కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్​ కాదని.. టీఎంసీ ఒక్కటే అనే భావన తీసుకొచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. మేఘాలయలో ప్రతిపక్ష కాంగ్రెస్​ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారంటే దీదీ రాజకీయ ఎత్తుగడలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. బిహార్​, యూపీలో కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.

TMC master plan to become alternate face to bjp
తృణమూల్.. ఆల్ ఇండియా 'కాంగ్రెస్' అవుతోందా?
author img

By

Published : Nov 25, 2021, 6:19 PM IST

Updated : Nov 25, 2021, 7:50 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. దేశ రాజకీయాల్లో సరికొత్త శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నారు. తృణమూల్​ కాంగ్రెస్​ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా సర్కార్​కు ప్రత్యామ్నాయం.. 135ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ కాదని, టీఎంసీ మాత్రమేనన్న భావన ప్రజల్లో తీసుకొచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​- మేలో జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కొని అఖండ విజయం సాధించిన దీదీ.. ఇప్పుడు అదే జోరును దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. మోదీని ఎదుర్కొనే ధైర్యసాహసాలు తమకే ఉన్నాయని చెబుతున్నారు(mamata banerjee news ).

ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్, అసోం, గోవాలో కాంగ్రెస్​ నుంచి కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది టీఎంసీ. ఇటీవల బీహార్​లోనూ హస్తం పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం భగవత్​ లాల్ ఝా కుమారుడు కిర్టి ఆజాద్​ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా దీదీ పార్టీలో చేరారు. హరియాణా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు. తాజాగా మేఘాలయలో ప్రతిపక్ష హోదాలో ఉన్న హస్తం పార్టీ నుంచి మాజీ సీఎం ముకుల్​ సంగ్మా సహా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ గూటికి వెళ్లారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునే టీఎంసీలో చేరినట్లు సంగ్మా తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హాదాలో తాము బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నామని, దీదీ నేతృత్వంలో ముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పారు(trinamool congress meghalaya).

ఎవరూ ఊహించని ఈ రాజీకయ ఎత్తుగడతో దీదీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు(trinamool congress news ).

trinamool congress news
టీఎంసీలో చేరిన గోవా మాజీ సీఎం ఫలేరో
trinamool congress news
టీఎంసీలో చేరిన అసోం మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సుస్మితా దేవ్​

ఇదీ చదవండి: టీఎంసీ గురి భాజపాపై... దెబ్బలు మాత్రం కాంగ్రెస్​కు.. ఎందుకిలా?

కాంగ్రెస్ ధ్వజం...

తమ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్రంగా స్పందించారు. కేవలం మేఘాలయలోనే కాకుండా మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో హస్తం పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. టీఎంసీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వీరంతా కాంగ్రెస్ టికెట్ మీదే గెలిచారని, పార్టీ కార్యకర్తల ఓట్లే వారిని గెలిపించాయన్నారు. టీఎంసీ టికెట్​పై గెలిస్తే వారి సామర్థ్యాలను ఒప్పుకుంటామన్నారు. కాంగ్రెస్​ను విచ్ఛిన్నం చేసి ప్రధాని మోదీ, భాజపాకు మేలు చేయాలని టీఎంసీ కోరుకుంటోందని ఆరోపించారు(TMC congress).

trinamool congress news
మమత విజయానందం

మీ అసమర్థత వల్లే..

మరోవైపు కాంగ్రెస్​ తమపై చేస్తున్న విమర్శలను టీఎంసీ​ తిప్పికొట్టింది. హస్తం పార్టీ అసమర్థత, అశక్తత కారణంగానే ఆ పార్టీ నేతలు తమవైపు చూస్తున్నారని సొంత పత్రిక 'జాగో బంగ్లా'లో వ్యాసం ప్రచురించింది(mamata banerjee latest news).

"భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు మోదీ, షా ద్వయాన్ని ఎలా ఓడించవచ్చో టీఎంసీ రుజువు చేసింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో మా పార్టీని విస్తరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. వేరే పార్టీలకు చెందిన ఎంతో మంది నాయకులు టీఎంసీలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మమతా బెనర్జీనే భాజపాకు ప్రత్యామ్నాయం అని వారంతా భావిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టీఎంసీపై నిందలు మోపొద్దు."

-జాగో బంగ్లా వ్యాసం

సోనియా గాంధీ నేృతృత్వంలో ఆగస్టులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో జాయింట్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని మమత సూచించారని, కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని టీఎంసీ వ్యాసంలో రాసుకొచ్చింది. ఎసీ గదులు, సామాజిక మాధ్యమాలకే కాంగ్రెస్ పరిమితమైందని దుయ్యబట్టింది. గోవా, త్రిపుర సహా ఇతర ప్రాంతాల్లో భాజపాకు వ్యతిరేకంగా రోడ్లపై పోరాటం చేస్తోంది తామేనని చెప్పింది(TMC goa). ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేయడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది(TMC news).

భాజపాను ఓడించేందుకు..

భాజపాను ఓడించేందుకు వచ్చే ఏడాది జరిగే ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేష్​ యాదవ్​ తమ మద్దతు కోరితే తప్పకుండా ఇస్తామని మమత ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరులో ముంబయి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్‌ను కలుస్తానని చెప్పారు. పంజాబ్ హరియాణాలోనూ టీఎంసీకి పునాదులు వేసేందుకూ సిద్ధమవుతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కూడా పాగా వేసేలా ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించి 2024 సాధారణ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనే లక్ష్యంతో మమత దూసుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చూపినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు(mamata banerjee party).

భాజపా నేత ప్రశంసలు..

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి దిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. ఆమెతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు స్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలో 'తృణమూల్ కాంగ్రెస్‌లో మీరూ చేరతారా?' అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "నేను ఇప్పటికే ఆమెతో ఉన్నాను. నేను చేరాల్సిన అవసరం లేదు," అని అన్నారు. తాను కలిసిన, కలిసి పనిచేస్తున్న రాజకీయ నాయకులందరిలో మమతా బెనర్జీ, జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు ప్రత్యేకమని స్వామి ట్వీట్​ చేశారు(mamata banerjee).

trinamool congress news
సుబ్రమణ్యస్వామి- మమత
trinamool congress news
సుబ్రమణ్యస్వామితో మమత భేటీ

ఆ మరునాడే ఎన్డీఏ సర్కార్ అన్ని విధాలా విఫలమైందని సొంత పార్టీపైనే విమర్శల వర్షం కురిపించారు సుబ్రమణ్యస్వామి. ఆర్థిక, సరిహద్దు భద్రత, విదేశాంగ విధానం, జాతీయ భద్రత, అంతర్గత భద్రత ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని ట్వీట్​ చేశారు. దీనికి బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. దీంతో ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారు? అనే సందేహాలు నెలకొన్నాయి(trinamool congress latest news).

టీఎంసీ వ్యూహం ఫలించేనా?

టీఎంసీ వ్యూహాలపై పలువురు నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

"జాతీయ స్థాయిలో నెట్​వర్క్​ను పెంచుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ టీఎంసీ వద్ద ఆ సమయం లేదు. గతంలో కూడా.. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు టీఎంసీలోకి చేరారు. ఎన్నికలు ముగిసిన తర్వాత టీఎంసీని వదిలి వెళ్లిపోయారు."

-- డా. అమల్​ కుమార్​ ముఖోపద్యాయ్​, ప్రెసిడెన్సీ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్​.

"రెండు దశాబ్దాలుగా.. పార్టీ ఫిరాయింపులు ఎక్కువ అయిపోయాయి. ఎన్నికల సమయంలో ఇది మరీ ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్​గా మారింది. వీరి వల్ల సంస్థాగతంగా బలాన్ని పెంచుకోవడం సాధ్యం కాదు. పార్టీలు మారే వారిని వెనకేసుకుని, తృణమూల్​ కాంగ్రెస్​ జాతీయస్థాయిలో ఎదగాలన్న వ్యూహం ఫలిస్తుందా, లేదా అన్న ప్రశ్నకు కాలమే జవాబు చెబుతుంది."

-- రాజ గోపాల్​ ధార్​ చక్రవర్తి, కోల్​కతా వర్సిటీ మాజీ రిజిస్ట్రార్​

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ రేసులో దేవెగౌడ మనవడు.. గెలిస్తే ఫ్యామిలీ అరుదైన ఘనత

Last Updated : Nov 25, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.