బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత ధర్మేంద్ర సింగ్ హత్య కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం.. హౌడాలోని షాలిమార్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు దుండగులు బైక్ మీద వచ్చి ధర్మేంద్రపై కాల్చులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నారు.
ధర్మేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధరించారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పాత కక్షలతోనే ధర్మేంద్రను దుండగులు కాల్చిచంపినట్టు తెలుస్తోంది.
ధర్మేంద్ర పురపాలక ఎన్నికల్లో విజయం సాధించారు. హౌడా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 39వ వార్డ్‌లో టీఎంసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు.
విధ్వంసం..
టీఎంసీ నేత హత్య జరిగిన కొద్ది గంటల అనంతరం హౌడా ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అనేక మంది రోడ్డు మీదకు వచ్చి దుకాణాలను దోచుకున్నారు. వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చూడండి:- బంగాల్ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?